ఇక చెరుకు రసం కేవలం వేసవిలోనే కాదు అన్ని కాలాల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే చెరుకు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్యకాలంలో పలువురు శాస్త్రవేత్తలు చెరుకు రసం వల్ల కలిగే అనేక లాభాలను వెలికి తీశారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు సైతం చెరుకు రసం తాగటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఈ చెరకు రసం జ్యూస్ పాయింటును మీరు ఆసుపత్రుల మధ్య ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది.
నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.