Post Office Scheme: రోజుకు రూ.50 ఇన్వెస్ట్ చేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తో పాటు మెచ్యూరిటీ సమయానికి రూ.35 లక్షల వరకు లాభం పొందవచ్చు. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ గ్రామ్ సురక్షా యోజన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పోస్టాఫీస్ సేవింగ్స్ ప్లాన్ : రూ.50 లతో రూ.35 లక్షల స్మార్ట్ ప్లాన్
ప్రస్తుతం సంపాదన ఎంత ముఖ్యమో, దాన్ని సరైన చోట దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. పైగా రూపాయి రూపాయి కూడబెడితే భవిష్యత్తులో అది కొండంత అండగా మారుతుంది. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో పోస్టాఫీస్ ఒక అదిరిపోయే సూపర్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే "గ్రామ్ సురక్షా యోజన".
మీ జేబులోంచి రోజుకు కేవలం 50 రూపాయలు తీసి పక్కన పెడితే చాలు.. లాంగ్ టర్మ్‌లో ఏకంగా 35 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. పైగా ఇందులో రూపాయి కూడా పోతుందనే భయం లేకుండా నూటికి నూరు శాతం సేఫ్టీ ఉంటుంది.
25
ఈ సూపర్ స్కీమ్‌కు ఎవరు ఎలిజిబుల్?
ఈ పథకంలో చేరడం చాలా ఈజీ. మీరు భారతీయ పౌరులై ఉండి, మీ వయస్సు 19 ఏళ్ల నుండి 55 ఏళ్ల మధ్య ఉంటే చాలు.. కళ్ళు మూసుకుని ఈ స్కీమ్‌లో జాయిన్ అయిపోవచ్చు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా సేవింగ్స్ అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో కనీస హామీ మొత్తాన్ని కేవలం రూ.10,000 గా నిర్ణయించారు. ఇక మాగ్జిమమ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ విషయానికి వస్తే, ఏకంగా రూ.10 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణను ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు.
35
మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా ప్రీమియం ఆప్షన్లు
ప్రతీ నెల ఇంతే కట్టాలి అనే రూల్స్ ఏమీ లేకుండా పోస్టాఫీస్ ఇందులో మంచి ఫ్లెక్సిబిలిటీని ఇచ్చింది. మీరు రోజుకు రూ.50 లెక్కన నెలకు సుమారు రూ.1,500 వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రీమియం మొత్తాన్ని మీ వీలును బట్టి నెలవారీగా, మూడు నెలలకొకసారి లేదా సంవత్సరానికి ఒకసారి పే చేసే ఆప్షన్లను ఎంచుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి బడ్జెట్ టెన్షన్లు లేకుండా మీ సేవింగ్స్ చాలా స్మూత్‌గా సాగిపోతాయి.
డబ్బులు దాచుకునేటప్పుడు మధ్యలో ఏవైనా ఎమర్జెన్సీ ఖర్చులు వస్తే ఎలా అనే డౌట్ చాలామందికి వస్తుంది. దానికి కూడా ఇందులో బెస్ట్ సొల్యూషన్ ఉంది. మీరు ఈ స్కీమ్‌లో జాయిన్ అయిన నాలుగు సంవత్సరాల తర్వాత అత్యవసర అవసరాల కోసం లోన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణం చేత పాలసీని మధ్యలోనే ఆపేయాలి అనుకుంటే, మూడు సంవత్సరాల తర్వాత దాన్ని సరెండర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాదు, మీరు ఐదేళ్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే ఈ పాలసీపై మంచి బోనస్ కూడా లభిస్తుంది.
55
ఇన్సూరెన్స్ ప్లస్ గ్యారెంటీ రిటర్న్స్ కూడా..
ఈ పాలసీకి సంబంధించిన మెచ్యూరిటీ పీరియడ్ వ్యక్తికి 80 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత పూర్తవుతుంది. అప్పుడే మెచ్యూరిటీకి సంబంధించిన పూర్తి మొత్తాన్ని చేతికి అందిస్తారు. పూర్తిగా సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్, అదిరిపోయే లాంగ్ టర్మ్ సేవింగ్స్.. ఈ మూడింటి కాంబినేషన్‌తో వస్తున్న ఈ గ్రామ్ సురక్షా యోజన గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ పొందుతోంది. లాంగ్ రన్‌లో రిస్క్ లేకుండా మంచి లాభాలు, లైఫ్ కవరేజ్ కావాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.