Saving Tips: నెల జీతంలో ఎంత పొదుపు చేయాలి? కొందరు ఫ్యూచర్ కోసం ఎక్కువ దాస్తే.. మరికొందరు అవసరాలు, ఆనందాలకూ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలా సేవింగ్స్ చేసే విధానాన్ని బట్టి మనుషులు మూడు రకాలు ఉంటారు. మరి మీరే రకమో ఇక్కడ తెలుసుకోండి.
నెల జీతంలో ఎంత మొత్తం సేవింగ్స్ కోసం పక్కన పెట్టాలి? ఫైనాన్షియల్ ప్లానింగ్ మొదలుపెట్టే విషయంలో ప్రతి ఒక్కరికీ వచ్చే పెద్ద డౌట్ ఇదే. ఆర్థిక నిపుణులు సేవింగ్స్ చేసే వాళ్లను వాళ్ల గోల్స్ బట్టి మూడు రకాలుగా విభజించారు. అగ్రెసివ్ సేవర్స్, మోడరేట్ సేవర్స్, లైఫ్‌స్టైల్ సేవర్స్ అని వీళ్లని పిలుస్తారు. అగ్రెసివ్ సేవర్స్ ఖర్చుల కంటే ఫ్యూచర్ కోసం ఎక్కువ దాచి త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తారు. మోడరేట్ సేవర్స్ ప్రస్తుత అవసరాలు తీర్చుకుంటూనే మెల్లగా ఆస్తులు కూడబెడతారు. కానీ లైఫ్‌స్టైల్ సేవర్స్ మాత్రం 'ఒక్కసారే బతుకుతాం' (YOLO) అనే మైండ్‌సెట్‌తో ఫ్యూచర్ కంటే ప్రజెంట్ ఎంజాయ్‌మెంట్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.
25
సేవర్స్లో 3 రకాలు
అగ్రెసివ్ సేవర్స్ హై-రిస్క్ ఇన్వెస్ట్మెంట్లు, కఠినమైన బడ్జెట్ ద్వారా డబ్బును పెంచుకుంటారు. ద్రవ్యోల్బణాన్ని బీట్ చేసి ఎక్కువ లాభాలు తెచ్చుకోవడానికి వీళ్లు జీతంలో పెద్ద భాగం దాచుకుంటారు. మోడరేట్ సేవర్స్ సొంతిల్లు కొనడం లేదా పిల్లల చదువు లాంటి మిడ్-టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు. రోజువారీ ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఆస్తులు పెంచుకుంటారు. ఇక లైఫ్‌స్టైల్ సేవర్స్ తమ లగ్జరీ ఖర్చులను తగ్గించుకోకుండా, ఫ్యూచర్ కోసం ఒక బేసిక్ అమౌంట్ మాత్రమే సేవ్ చేస్తారు.
35
మీరు ఏ రకమైన సేవరో ఎలా తెలుసుకోవాలి?
మీరు ప్రజెంట్ లైఫ్‌స్టైల్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేక ఫ్యూచర్ వెల్త్‌కు ఇస్తున్నారా అనే దాన్ని బట్టి మీ సేవర్ ప్రొఫైల్ డిసైడ్ అవుతుంది. త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటే (అగ్రెసివ్ సేవర్) హై-రిస్క్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ 30-50% సేవ్ చేయాలి. మిడ్-టర్మ్ గోల్స్ ఉంటే (మోడరేట్ సేవర్) 20-30% సేవ్ చేస్తూ ఈక్విటీలో బ్యాలెన్స్డ్గా ఇన్వెస్ట్ చేయాలి. లైఫ్‌స్టైల్ తగ్గకుండా ఉండాలంటే (లైఫ్‌స్టైల్ సేవర్) 10-15% సేవ్ చేస్తే చాలు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే కెపాసిటీ, ఫ్యూచర్ కోసం ఇప్పుడు కొన్ని త్యాగాలు చేసే మైండ్‌సెట్ మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి.
ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులు తీర్చేసి, ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. మీ ఫైనాన్షియల్ గోల్ చాలా ఏళ్ల తర్వాత ఉంటే, లాంగ్ టర్మ్ గ్రోత్ ముఖ్యం. అప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. కానీ రాబోయే కొన్నేళ్లలో డబ్బు అవసరం ఉంటే మాత్రం ఈక్విటీలో పెట్టకూడదు. ఎందుకంటే మార్కెట్ పడిపోతే నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ అవసరాల కోసం డబ్బును సేఫ్‌గా, ఈజీగా తీసుకునే లిక్విడ్ ఫండ్స్‌లో దాచుకోవడం బెస్ట్.
55
సేవింగ్స్ పై ద్రవ్యోల్బణం ఎఫెక్ట్
ద్రవ్యోల్బణం అనేది మన దగ్గర ఉన్న డబ్బు వాల్యూను తగ్గించే ఒక సైలెంట్ ట్యాక్స్. 15 ఏళ్ల లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే, క్యాష్, ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్స్ వాల్యూను ద్రవ్యోల్బణం మెల్లగా తినేస్తుంది. ఉదాహరణకు, 70% డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే లైఫ్‌స్టైల్ సేవర్ ద్రవ్యోల్బణం వల్ల రియల్ ప్రాఫిట్ కోల్పోతాడు. కానీ 80% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే అగ్రెసివ్ సేవర్ బిజినెస్ గ్రోత్ ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఈజీగా బీట్ చేస్తాడు. కాబట్టి లాంగ్ టర్మ్‌లో మీ డబ్బును కాపాడుకోవడానికి గోల్స్ టైమ్‌ను బట్టి ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ను కరెక్ట్‌గా వాడుకోవాలి.