SIP Scheme: ఆదాయం త‌గ్గిందా.? SIP నెలవారీ పెట్టుబడి మొత్తాన్ని ఎలా తగ్గించుకోవాలి?

Published : May 22, 2026, 09:36 AM IST

SIP Scheme: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారిలో చాలా మంది సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ను ఎంచుకుంటారు. సాధారణంగా జీతం పెరిగినప్పుడు SIP మొత్తాన్ని పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఆదాయం తగ్గితే ఏం చేయాలో తెలుసా.?  

PREV
15
ఆదాయం తగ్గితే SIPను వెంటనే రద్దు చేయాల్సిన అవసరం లేదు

ఆర్థిక పరిస్థితులు మారినప్పుడు చాలామంది పెట్టుబడిదారులు తమ SIPలను పూర్తిగా నిలిపివేస్తారు. దీంతో సంవత్సరాలుగా కొనసాగుతున్న పెట్టుబడులపై లభించే కాంపౌండింగ్ ప్రయోజనం దెబ్బతింటుంది. వాస్తవానికి SIPను రద్దు చేయకుండా కూడా పెట్టుబడి మొత్తాన్ని తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి. వాటి గురించి అవగాహన లేకపోవడం వల్లే చాలామంది నష్టపోతున్నారు.

25
SIP మొత్తాన్ని తగ్గించుకునేందుకు ఉన్న మూడు ప్రధాన మార్గాలు

SIP పెట్టుబడి మొత్తాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి సాధారణంగా మూడు ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

SIPను తాత్కాలికంగా నిలిపివేయడం:

చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు (AMCలు) SIPను పూర్తిగా రద్దు చేయకుండా 1 నుంచి 6 నెలల వరకు పాజ్ (Pause) చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత మళ్లీ SIP కొనసాగించవచ్చు.

SIP మొత్తాన్ని నేరుగా తగ్గించడం:

కొన్ని పెట్టుబడి యాప్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం కొనసాగుతున్న SIP మొత్తాన్ని నేరుగా తగ్గించే సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఉదాహరణకు నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడుతున్నవారు దాన్ని రూ. 3,000కు తగ్గించుకోవచ్చు.

పాత SIPను రద్దు చేసి కొత్త SIP ప్రారంభించడం

ఇది ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. ప్రస్తుతం ఉన్న SIPను రద్దు చేసి, ఇప్పటికే పెట్టుబడి చేసిన డబ్బును అలాగే ఉంచి, తక్కువ మొత్తంతో కొత్త SIPను ప్రారంభించవచ్చు.

35
ప్రతి AMCలో నిబంధనలు వేర్వేరుగా ఉండొచ్చు

SIP మొత్తాన్ని తగ్గించే విధానం అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో ఒకేలా ఉండదు. కొన్ని AMCలు యాప్ ద్వారానే మార్పులు చేసుకునే అవకాశం ఇస్తే, మరికొన్ని సంస్థల్లో ప్రత్యేక అభ్యర్థన లేదా కొత్త నమోదు అవసరం కావచ్చు. కాబట్టి SIPలో మార్పులు చేసే ముందు సంబంధిత AMC లేదా పెట్టుబడి ప్లాట్‌ఫారమ్ నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

45
వరుసగా మూడు EMIలు మిస్ అయితే ఏమవుతుంది?

చాలామంది పెట్టుబడిదారులకు తెలియని ముఖ్యమైన విషయం ఏమిటంటే, వరుసగా మూడు SIP వాయిదాలు చెల్లించకపోతే SIP ఆటోమేటిక్‌గా రద్దు కావచ్చు. భారతదేశంలోని దాదాపు అన్ని AMCలు ఈ నిబంధనను అమలు చేస్తున్నాయి. ఒకసారి SIP రద్దయితే దానిని మళ్లీ ప్రారంభించడానికి కొత్త నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పెట్టుబడికి అంతరాయం ఏర్పడి, కాంపౌండింగ్ ద్వారా లభించే దీర్ఘకాలిక లాభాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందువల్ల చెల్లింపులు ఆపేయడం కంటే, SIP మొత్తాన్ని తగ్గించడం లేదా తాత్కాలికంగా పాజ్ చేయడం వంటి ఎంపికలను ముందుగా పరిశీలించడం మంచిది.

55
SIP కొనసాగించడం ఎందుకు ముఖ్యం?

SIP అనేది దీర్ఘకాలిక సంపద సృష్టికి ఉపయోగపడే సాధనం. ఆదాయం తాత్కాలికంగా తగ్గిందని పెట్టుబడిని పూర్తిగా ఆపేయడం కంటే, మీ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా SIP మొత్తాన్ని తగ్గించుకోవడం ఉత్తమ మార్గం. చిన్న మొత్తంతోనైనా పెట్టుబడిని కొనసాగించడం వల్ల మార్కెట్ అవకాశాలను కోల్పోకుండా, భవిష్యత్తులో మంచి రాబడులు పొందే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories