IDBI బ్యాంక్ ఎక్స్‌క్లూజివ్ FD స్కీమ్
IDBI బ్యాంక్ 375 నుండి 444 రోజుల వ్యవధితో రెండు ప్రత్యేకమైన FD స్కీమ్‌లను అందిస్తోంది. ఇంకా అక్టోబర్ 31, 2023 వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. "అమృత్ మహోత్సవ FD స్కీమ్" అని పిలువబడే 375 రోజుల FD సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటు చెల్లిస్తోంది.
మరోవైపు, 444 రోజుల FD పథకంలో సాధారణ ప్రజలు 7.15 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. అదనంగా, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ రేటును అందిస్తారు.