పండగ సీజన్‌లో బంగారం కొందామనుకున్నవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు పడిపోతూ వస్తున్న ధరలు ఒక్కసారి కొండెక్కాయి. మరోవైపు పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఇదిలా కొనసాగితే దీపావళి వరకల్లే ధరలు మరింత మండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, యూఎస్ ఫెడ్ ఛైర్మన్ సంకేతాలు దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు.