ఇంట్లోనే చేపలు పెంచి లక్షలు సంపాదించొచ్చు.. ప్రూవ్ చేస్తున్న రైతులు

First Published | Aug 13, 2024, 1:34 PM IST

సాధారణంగా చెరువులు, కుంటల్లో చేపలు పెంచుతుంటారు. ఇళ్లలోనూ అక్వేరియంలో చేపలు పెంచడం తెలుసు. మరి ఇళ్లలోని గదులను నీటి మడులుగా మార్చి చేపలు పెంచి మార్కెట్లో అమ్మడం గురించి విన్నారా.. ఈ కొత్త విధానం పట్టణ ప్రజలను ఆకర్షిస్తోంది. నగరాల్లో విస్తరిస్తున్న ఈ సరికొత్త చేపల పెంపకం గురించి తెలుసుకుందామా..

ఆక్వా కల్చర్‌లో చేపల పెంపకం లాభసాటి ఆదాయాన్నిచ్చే మార్గం. రొయ్యలైలే ఒక్క పంటలోనే లక్షాధికారులు కావచ్చు.. పూర్తిగా దివాలానూ తీయవచ్చు. చేపలు అలా కాదు. సక్రమంగా సాగు చేస్తే కనీస లాభాలనిచ్చే పంట. అందుకే రిస్క్‌ తీసుకోవడం ఎందుకని చాలా మంది ఆక్వా రైతులు ఎక్కువగా చేపల పెంపకానికి మొగ్గు చూపుతారు. దేశవ్యాప్తంగా సాగులో ఉన్న వాణజ్య పంటల్లో ఆక్వాకు ప్రత్యేక స్థానం ఉంది. 

ప్రభుత్వ ప్రోత్సాహం..

ప్రపంచంలో భారత దేశం 3వ అతిపెద్ద చేపల ఉత్పత్తి చేసే దేశం. దేశ వ్యాప్తంగా 2.36 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో చెరువుల్లో చేపల పెంపకం చేపట్టారు. పాండ్‌ కల్చర్‌, కేజ్‌ కల్చర్‌, రేస్‌వే కల్చర్‌, రిసర్కులేటింగ్‌ సిస్టమ్‌ వంటి అనేక విధానాలు అందుబాటులో ఉన్నాయి.  మత్స్య శాఖ, ఆక్వా కల్చర్‌ విభాగాలు మత్స్యకారులనే కాకుండా ఇతర రైతులను చేపల పెంపకం చేపట్టేలా ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 5.24 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది.  తెలంగాణ రాష్ట్రంలో 5,72,167 హెక్టార్లలో చేపల చెరువులు ఉన్నాయి. ఇళ్లలో చేపల పెంపకానికి ప్రభుత్వ సెరీకల్చర్‌, ఆక్వా కల్చర్‌ విభాగాలు సహకారం అందిస్తున్నాయి. 
 


తొట్టెలు, ట్యాంకుల్లో సాగు..

ఇప్పటికే చాలా చోట్ల ఇళ్లపై పెరటి తోటల మాదిరిగా తొట్టెలు ఏర్పాటు చేసి చేపలు పెంచుతున్నారు. దీన్ని మినీ ఆక్వా కల్చర్‌ అంటారు. 5000 నుంచి 10000 లీటర్ల నీటిని ట్యాంకుల్లో వీటిని పెంచుతున్నారు. కొందరు సిమెంట్ ట్యాంకులు కట్టించి పెంచుతున్నారు. 

ఇండోర్‌షిప్‌ ఫార్మింగ్‌..

ఈ విధానాన్ని అప్‌గ్రేడ్‌ చేస్తూ ఇళ్ల గదులనే మడులుగా మార్చి చేపలు పెంచుతున్నారు. దీన్ని ఇండోర్‌షిప్‌ ఫార్మింగ్‌ అంటారు.  ఆక్వాఫోనిక్స్‌ విధానంలో చేపలు పెంచడం లాభదాయకంగా మారింది. రాజమండ్రి, నిజామాబాద్‌, కరీంనగర్‌, హన్మకొండ తదితర ప్రాంతాల్లో కొందరు ఈ విధానం ద్వారా చేపలు సాగు చేస్తూ స్థానిక మార్కెట్‌లో విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. 

సాగు ఎలా అంటే..

 ఇతర దేశాల్లో టిలాపియా, గోల్డ్‌ఫిష్‌, గుప్పీస్‌,కార్ప్‌, బెట్టాస్‌ వంటి చేపలు పెంచుతున్నారు. ఆంధ్రపద్రేశ్‌, తెలంగాణలో మాత్రం కొరమీను రకాన్ని బాగా పెంచుతున్నారు. వీటికోసం గదులను నీటి మడులుగా మార్చాలి. నీరు లీకవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ, గాలి వచ్చే విధంగా కిటికీలు, తలుపులు ఉండాలి. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నందున ఎక్కువ మంది వీటిని కొనేందుకు ముందుకు వస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో ప్రజలు ఇండోర్‌షిప్‌ ఫిష్‌ పార్మింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. 

Latest Videos

click me!