ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే గత ఏడాది కాలంలో భారత స్టాక్ మార్కెట్ మెరుగైన పనితీరును కనబరిచింది . నిఫ్టీ 45 శాతం రిటర్న్ ఇచ్చింది. అఅలాగే ఈ సంవత్సరం జనవరి నుండి నిఫ్టీ 19 శాతం పెరిగింది. మెక్సికన్ మార్కెట్ ఈ సంవత్సరం 18.97 శాతం రాబడిని ఇచ్చింది. తైవాన్ మార్కెట్ 15.70 శాతం, చైనా మార్కెట్ 1.94 శాతం, ఫ్రాన్స్ అండ్ కొరియా అలాగే యుఎస్ మార్కెట్లు కాస్త తక్కువ రాబడిని ఇచ్చాయి. భారతీయ స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక సంవత్సరంలో రూ .75 లక్షల కోట్లు పెరిగింది. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లో రూ .2.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. రిటైల్ పెట్టుబడిదారులు ఎస్ఐపి ద్వారా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. గత 20 రోజుల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10.56 లక్షల కోట్లు పెరిగింది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మాక్రో ఎకానమీ డేటా, వాహన విక్రయాల డేటా, ప్రపంచ ధోరణి ఈ వారం దేశీయ ఈక్విటీ మార్కెట్ల దిశను నిర్ణయిస్తాయి. అంతేకాకుండా పెట్టుబడిదారులు కోవిడ్ -19 వాక్సినేషన్ వేగాన్ని చూస్తారు. మార్కెట్ల దిశ కూడా రూపాయి, బ్రెంట్ ముడి చమురు ధోరణిపై ఆధారపడి ఉంటుంది.
హెవీ వెయిట్ షేర్లలో నేడు భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కోటక్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఇండియా యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎన్‌టిపిసి, మారుతి, నెస్లే ఇండియా, ఐటిసి షేర్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.