Share Market: రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే 35 లక్షలు మీ సొంతం..ఎలాగో తెలుసుకోండి..?

Published : Aug 24, 2022, 04:59 PM IST

స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం చాలా సులువు అని కొందరు వాదిస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మాత్రం చాలా రిస్కు అని చెబుతుంటారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్లో మాత్రం మల్టీ బ్యాగర్ స్టాక్స్ తమ సత్తాను చాటుతూనే ఉంటాయి.

PREV
15
Share Market: రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే 35 లక్షలు మీ సొంతం..ఎలాగో తెలుసుకోండి..?

గత రెండేళ్లలో చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసి స్టాక్స్ చాలా ఉన్నాయి. తాజాగా మనం చూసినట్లయితే  ఇండో అమీన్స్ (Indo Amines Share) తన పాత రికార్డులన్నింటినీ బుధవారం బద్దలు కొట్టింది. ఈ రోజు బిఎస్‌ఇలో Indo Amines కంపెనీ షేర్లు ఆల్‌టైమ్ స్థాయి అయిన రూ.176ను తాకింది.
 

25

కోవిడ్-19 తర్వాత, స్టాక్ మార్కెట్ పెద్ద సంఖ్యలో మల్టీబ్యాగర్ స్టాక్‌లను గమనించవచ్చు. ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఇండో అమీన్స్ (Indo Amines) కూడా ఒకటి. గత రెండేళ్లలో ఇన్వెస్టర్ల డబ్బులను రెండింతలు చేసిన స్టాక్స్ లో ఈ కంపెనీ ఉంది. ఇక ఈ కంపెనీ బుధవారం తన పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఈ రోజు బిఎస్‌ఇలో కంపెనీ షేర్లు ఆల్‌టైమ్ స్థాయి రూ.176కి చేరాయి. కంపెనీ స్టాక్  రెండేళ్ల ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. 
 

35
కంపెనీ స్టాక్ చరిత్ర ఏమిటి

ఏప్రిల్ 2020లో, ఇండో అమీన్స్ (Indo Amines) ఒక షేరు ధర రూ. 14 పలికింది. అయితే 24 ఆగస్టు 2022న రూ.176 స్థాయికి పెరిగింది. అంటే.. ఈ రెండేళ్లలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు 1150 శాతం రాబడిని అందించింది. గత నెల రోజులుగా కంపెనీ షేరు ధర రూ.97 నుంచి రూ.176 స్థాయికి పెరిగింది. ఒక నెలలో కంపెనీ షేరు ధర 70 శాతం వరకు పెరిగింది. గత 6 నెలల గురించి మాట్లాడుకుంటే, కంపెనీ షేరు ధర రూ.90 నుండి రూ.176 స్థాయికి ఎగబాకింది. ఈ సమయంలో, షేరు ధర దాదాపు 85 శాతం పెరిగింది. ఈ ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో కంపెనీ షేర్‌హోల్డర్లు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈ సమయంలో కంపెనీ షేరు ధర రూ.100 నుంచి రూ.75 స్థాయికి దిగజారింది.
 

45

గత మూడేళ్ల పనితీరు గురించి చెప్పాలంటే, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ధర రూ.31 నుంచి రూ.176 స్థాయికి పెరిగింది. అంటే పొజిషనల్ ఇన్వెస్టర్లకు కంపెనీ 475 శాతం రాబడిని ఇచ్చింది. పదేళ్ల క్రితం కంపెనీ షేరు ధర రూ.4.75. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేరు ధర రూ.176 స్థాయికి చేరుకుంది. 10 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌పై నమ్మకం ఉంచి, ఇప్పటివరకు కొనసాగిన ఇన్వెస్టర్ల అదృష్టం మారిపోయిఉండేది. కంపెనీ తన పెట్టుబడిదారులకు 3600 శాతం రాబడిని ఇచ్చింది. కంపెనీ 52 వారాల గరిష్టం రూ.176. కాగా, బీఎస్‌ఈలో 52 వారాల కనిష్టం రూ.70.25. కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.1113 కోట్లుగా ఉంది. 
 

55

(Disclaimer: ఇక్కడ అందించిన పనితీరు సమాచారం పెట్టుబడి సలహా మాత్రమే కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం నష్టాలకు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు మీ సలహాదారుని సంప్రదించండి.)

Read more Photos on
click me!

Recommended Stories