యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి సంస్థ ఆధీనంలోని రుచి సోయాకు FPOకు మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI ఝలక్ ఇచ్చింది. ఇందులో ఇన్వెస్టర్లను తప్పుడు పద్ధతుల ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేసినందుకు గానూ బిడ్స్ ఉపసంహరించుకునే అవకాశాన్ని SEBI కల్పించింది. చాలా అరుదైన సందర్భాల్లోనే సెబీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన రుచి సోయాపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక చర్య తీసుకుంది. మార్కెట్ రెగ్యులేటర్ రుచి సోయా FPO (ఫాలో ఆన్ ఆఫర్)లో పెట్టుబడి పెట్టడానికి ప్రేరేపించేందుకు తప్పుడు మార్గం ఎంచుకున్న కారణంగా రిటైల్ పెట్టుబడిదారులకు వారి బిడ్‌లను ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించింది. పెట్టుబడిదారులు తమ బిడ్లను మార్చి 30 వరకు ఉపసంహరించుకోవచ్చు. సెబీ చాలా తక్కువ కేసుల్లో మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది.
24
బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ వినియోగదారులకు రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన రూ. 4,300 కోట్ల ఎఫ్‌పిఓలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని అయాచిత SMSలు పంపినట్లు సెబి (SEBI) ఎంక్వైరీలో తేలింది. ఈ నేపథ్యంలో రెగ్యులేటర్ రిటైల్ ఇన్వెస్టర్లకు బిడ్స్ ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది.
34
SMSలో ఏమి ఉంది...
కస్టమర్‌లకు పంపిన SMS సందేశంలో, “పతంజలి కుటుంబ సభ్యులకు శుభ వార్త . పతంజలి గ్రూప్‌కు చెందిన రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ FPO రిటైల్ పెట్టుబడిదారుల కోసం తెరవబడింది. ఇష్యూ మార్చి 28తో ముగుస్తుంది. మార్కెట్ ధర కంటే 30 శాతం తక్కువగా ఉన్న ఒక్కో షేరు రూ.615-650కి లభిస్తోంది. మీరు మీ డీమ్యాట్ ఖాతా నుండి బ్యాంక్/బ్రోకర్/UPI ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. అని పేర్కొంది.
44
రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి తక్కువగానే ఉంది
ఇటువంటి అయాచిత సందేశాల (SMS) పట్ల పెట్టుబడిదారులను హెచ్చరిస్తూ, మంగళ, బుధవారాల్లో వార్తాపత్రికలలో ప్రకటనలను ప్రచురించాలని ఎఫ్‌పిఓల ప్రధాన బ్యాంకర్లను సెబి ఆదేశించింది. రుచి సోయా FPO మార్చి 28న ముగిసింది. దీని సబ్‌స్క్రిప్షన్ ఊహించిన దాని కంటే 3.6 రెట్లు తక్కువగా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన భాగానికి 88 శాతం బిడ్లు మాత్రమే వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ (QIB) షేర్ 2.2 రెట్లు నిండింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్‌ఐఐ) కోటాలో అత్యధికంగా 11.75 రెట్లు బిడ్ అందుకుంది.