భగత్ సింగ్ ని ఒక్కరోజు ముందుగానే ఎందుకు ఊరి తీశారు.. మీకు తెలియని ఆశ్చర్యకర విషయాలు..

Ashok Kumar   | Asianet News
Published : Mar 26, 2022, 03:15 PM IST

మార్చి 23వ తేదీ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. భారతదేశం ప్రతి ఏడాది మార్చి 23న అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ రోజున భారతదేశపు వీర పుత్రులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ప్రతి దేశ ప్రేమికుడికి, యువతకు షహీద్ భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు పేర్లు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఈ ముగ్గురూ యువతకు రోల్ మోడల్స్ ఇంకా స్ఫూర్తి కూడా. 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. 

PREV
17
భగత్ సింగ్ ని ఒక్కరోజు ముందుగానే ఎందుకు ఊరి తీశారు.. మీకు తెలియని ఆశ్చర్యకర విషయాలు..

లాహోర్ కుట్రలో వీరికి మరణశిక్ష విధించబడింది. అయితే ఈ ముగ్గురు అమరవీరుల మరణం కూడా బ్రిటిష్ ప్రభుత్వ కుట్ర అని మీకు తెలుసా..? భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను మార్చి 24న ఉరితీయాలని నిర్ణయించారు, అయితే బ్రిటిష్ ఈ భారతదేశపు ముగ్గురు అమరవీరులను ఒక రోజు ముందుగా అంటే మార్చి 23న ఉరితీశారు. దీనికి కారణం ఏమిటి? అంతెందుకు భగత్ సింగ్, అతని సహచరులు చేసిన నేరం ఏమిటి, వారికి మరణశిక్ష ఎందుకు విధించబడింది. భగత్ సింగ్ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

27

సెంట్రల్ అసెంబ్లీలో బాంబు పేలుడు
నిజానికి, భగత్ సింగ్, అతని సహచరుడు బటుకేశ్వర్ దత్ 8 ఏప్రిల్ 1929న సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరారు, ఇంకా స్వాతంత్ర్య నినాదాలు చేయడం ప్రారంభించారు. కానీ పారిపోలేదు, అయితే బాంబు విసిరిన తరువాత అరెస్టు వారిని చేశారు. ఈ సమయంలో అతనికి దాదాపు రెండేళ్ల జైలు శిక్ష పడింది.
 

37

భగత్ సింగ్ జైల్లో ఉన్న రెండేళ్లలో విప్లవాత్మక కథనాలు రాస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేసేవాడు. బ్రిటీష్ వారితో పాటు, అతని రచనలలో చాలా మంది  పేర్లు కూడా ఉన్నాయి, వారిని అతను తనకు  ఇంకా దేశానికి శత్రువులుగా భావించేవాడు. భగత్ సింగ్ భారతీయుడైన సరే కార్మికులను దోపిడి చేసేవాడు తన శత్రువు అని ఒక వ్యాసంలో రాశాడు.
 

47

దేశం పేరు మీద ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ చాలా మేధావి, అనేక భాషలలో జ్ఞాని. అతనికి హిందీ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, ఇంగ్లీష్ బాషలు తెలుసు. బటుకేశ్వర్ దత్ దగ్గర బంగ్లా నేర్చుకున్నాడు. తన రచనలలో, అతను భారతీయ సమాజంలో లిపి, కులం, మతం వల్ల కలిగే దూరాల గురించి ఆందోళన, బాధను వ్యక్తం చేశాడు.

57

రెండేళ్ళ జైలు శిక్ష తర్వాత మార్చి 24, 1931న రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో పాటు అతడిని ఉరితీయవలసి వచ్చింది, అయితే అతనిని ఉరితీసే వార్త దేశంలో కలకలం రేపింది. ఈ ముగ్గురుని ఉరి తీయడాన్ని నిరసిస్తూ  నిరసనలు కూడా తెలిపారు. భారతీయుల ఆగ్రహాన్ని, నిరసనను చూసి బ్రిటిష్ ప్రభుత్వం నివ్వెరపోయింది.

67

బ్రిటిష్ ప్రభుత్వానికి  భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను ఉరితీసే రోజున భారతీయుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందేమోనని బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది . పరిస్థితులు చెయ్యి దాటిపోవచ్చు. ఆలాంటి పరిస్థితిలో బ్రిటిష్ ప్రభుత్వం హఠాత్తుగా ఉరి రోజుని ఇంకా సమయాన్ని మార్చింది.
 

77

11 గంటల ముందే భగత్ సింగ్‌ ఉరి 
భగత్ సింగ్ ఉరికీ ముందుగా నిర్ణయించిన సమయానికి 11 గంటల ముందే అంటే 23 మార్చి 1931న రాత్రి 7.30 గంటలకు ఉరి తీసారు. ఈ సమయంలో ఉరిని పర్యవేక్షించడానికి మేజిస్ట్రేట్ ఎవరూ సిద్ధంగా లేరు. భగత్ సింగ్‌ను ఉరితీసినప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించిందని చెబుతుంటారు. ఈ ముగ్గురు చివరి వరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు.   

click me!

Recommended Stories