లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ : 148 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 18 వేల చేరువలో నిఫ్టీ..

First Published Oct 12, 2021, 4:38 PM IST

నేడు  దేశీయ స్టాక్ మార్కెట్ కాస్త హెచ్చు తగ్గులు తర్వాత లాభాలలో  ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 148.53 పాయింట్ల లాభంతో (0.25 శాతం) 60,284.31 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 46.00 పాయింట్ల (0.26 శాతం) లాభంతో 17,991.95 వద్ద ముగిసింది. గత వారం 30-షేర్ల బి‌ఎస్‌ఈ సెన్సెక్స్ 1,293.48 పాయింట్లు (2.20 శాతం) పెరిగింది. 
 

స్టాక్ మార్కెట్ ఈ రోజు వరుసగా నాలుగో రోజు కూడా గ్రీన్ మార్క్‌లో ముగిసింది. యూ‌ఎస్ స్టాక్ మార్కెట్లు బలహీనతతో ముగిశాయి. డౌ జోన్స్ 0.72 శాతం తగ్గి 34,496 వద్ద ముగిసింది. నాస్‌డాక్ 0.64 శాతం తగ్గి 14,486 స్థాయికి చేరింది. ఎస్&పి 500 0.69 శాతం తగ్గి 4,361 వద్ద ముగిసింది.

టైటాన్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బిఐ, దివిస్ ల్యాబ్ స్టాక్ లాభాలలో ముగిశాయి. మరోవైపు, హెచ్‌సిఎల్ టెక్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు రెడ్ మార్క్‌లో ముగిశాయి.  

సెక్టోరల్ ఇండెక్స్‌ని చూస్తే నేడు ఐటీ మినహా అన్ని రంగాలు గ్రీన్ మార్క్‌లో  ముగిశాయి. వీటిలో ఫైనాన్స్ సేవలు, ఎఫ్‌ఎం‌సి‌జి, రియల్టీ, ఫార్మా, మీడియా, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఆటో, మెటల్, పి‌ఎస్‌యూ బ్యాంకులు ఉన్నాయి.

 ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్ రెడ్ మార్క్‌లో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ సూచీ సెన్సెక్స్ 117.08 పాయింట్లు (0.19 శాతం) తగ్గి 60018.70 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 11.70 పాయింట్లు (0.07 శాతం) తగ్గి 17934.30 స్థాయిలో ప్రారంభమైంది. 

ఉదయం 9.01 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో సెన్సెక్స్ 42.51 పాయింట్లు (0.07 శాతం) తగ్గి 60093.27 స్థాయిలో ఉంది. నిఫ్టీ 17.80 పాయింట్లు (0.10 శాతం) పెరిగి 17963.80 వద్ద ఉంది.


నిన్న సోమవారం కూడా స్టాక్ మార్కెట్ అధిక స్థాయిలో ముగిసింది. సెన్సెక్స్ 76.72 పాయింట్ల లాభంతో (0.13 శాతం) 60,135.78 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 50.75 పాయింట్ల లాభంతో (0.28 శాతం) 17,945.95 వద్ద ముగిసింది. 
 

  రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా మరోసారి స్టాక్‌ మార్కెట్‌తో లాభపడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలో 375 కోట్ల రూపాయల్ని సంపాదించారు. ఆయన పెట్టుబడులు పెట్టిన నజారా టెక్నాలజీస్‌, టైటాన్‌ కంపెనీ, టాటా మోటర్స్‌ స్టాకులు ఒక్కసారిగా పెరగడంతో ఆయన సంపాదనా భారీగా పెరిగింది. 


చివరి నాలుగు రోజుల్లో ఒక్క టాటా మోటర్స్‌ షేర్లు మాత్రమే  30 శాతం పెరగడం విశేషం. మోర్గాన్‌ స్టాన్లే వెల్లడించిన రిపోర్ట్‌ ప్రకారం రూ.298గా ఉన్న టాటా షేర్ల ధరలు  రూ.448కి చేరుకున్నాయి.  ఈ బలమైన పెరుగుదలతో ఆయన ఆదాయం వందల కోట్లను దాటేసింది. మూడు రోజుల్లోనే 310 కోట్ల రూపాయల్ని(24 శాతం షేర్ల పెరుగుదల) సంపాదించారు. 

click me!