మొదటి నాలుగు సంవత్సరాల వార్షిక రుసుములను మాఫీ చేయడం ద్వారా ఎస్బీఐ కార్డ్ ఉన్నతి ప్రత్యేకంగా నిలిచింది. ఈ నాలుగేళ్లలో ఎలాంటి వార్షిక రుసుము లేకుండా కార్డ్ హోల్డర్లు ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు. అయితే ఐదవ సంవత్సరం నుండి రూ.499 వార్షిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు మొదటి సంవత్సరం నుంచే వార్షిక రుసుములు వసూలు చేస్తున్నాయి.
‘ఎస్బీఐ కార్డ్ ఉన్నతి’ ఆకర్షణీయమైన రివార్డ్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. కార్డ్ హోల్డర్లు ప్రతి రూ. 100కి ఒక రివార్డ్ పాయింట్‌ను పొందుతారు. అయితే నగదు లావాదేవీలు, బ్యాలెన్స్ బదిలీలు, ఫ్లెక్సీ చెల్లింపు, ఇంధన కొనుగోళ్లు వంటి లావాదేవీలకు రివార్డ్ పాయింట్ల రావు. సంవత్సరానికి రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే వారికి, కార్డ్ అదనపు ప్రయోజనంగా రూ.500 క్యాష్ బ్యాక్‌ను అందిస్తుంది.