ఈ టిప్స్ పాటిస్తే మీరు సరైన బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు

First Published | Jan 4, 2025, 3:04 PM IST

టూ వీలర్ ఉన్న ప్రతి ఒక్కరికీ వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. కాని ఈ విషయంపై ఎవరూ పెద్దగా శ్రద్ధ పెట్టరు. టూ వీలర్ కొన్నప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కాని దాన్ని రీన్యూవల్ చేయించరు. కాని ప్రతి టూ వీలర్ కి ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. ఇది మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబానికి కూడా భద్రతనిస్తుంది. మీ బడ్జెట్, ఇన్ కమ్ కి తగ్గ సరైన ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవడానికి టిప్స్ ఇక్కడ ఉన్నాయి. 

మిడిల్, వర్కింగ్ క్లాస్ వాళ్లకి టూ వీలర్స్ చాలా ముఖ్యం. ప్రతి రోజు ఆఫీసుకు వెళ్లి రావడానికి, ఆఫీసు పని మీద ఇతర ప్రాంతాలకు తిరిగి రావడానికి వెహికల్స్ చాలా ముఖ్యం. ఇవి ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. సమయాన్ని తగ్గిస్తాయి. బైక్ ఉపయోగించే చాలా మందికి బైక్ ఇన్సూరెన్స్ గురించి తెలియదు. కాని వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్ లోనే అనేక పాలసీల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్క క్లిక్ తో మీకు ఎంతో సమాచారం లభిస్తుంది. ఇక ప్రీమియం కాలిక్యులేటర్లు మీ ఆర్థిక స్థితికి తగ్గ పాలసీ ప్రీమియంని ఎంచుకోవడానికి సహకరిస్తాయి. ప్రీమియంలు బైక్ రకం, ఇంజిన్ కెపాసిటీ, IDV, యాడ్-ఆన్‌లు, కవరేజ్ పరిధిని బట్టి మారుతూ ఉంటాయి.

బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు వాహన దెబ్బతిన్నా, దొంగతనానికి గురైనా, డ్రైవింగ్ చేసే వ్యక్తికి గాయాలైనా ఆర్థికంగా రక్షణ కల్పిస్తాయి. అయితే పాలసీని ఎంచుకొనేటప్పుడు ప్రీమియంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలి. మోటార్ సైకిల్ రకం, ఇంజిన్ కెపాసిటీ, IDV, యాడ్-ఆన్ కవర్లు, పాలసీ కవరేజ్‌ని బట్టి ప్రీమియం మారుతుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు పాలసీల మధ్య పోలికలు, ప్రీమియం కాలిక్యులేటర్లతో బైక్ ఇన్సూరెన్స్ కొనుగోళ్లను సులభతరం చేస్తున్నాయి. ఈ ఫెసిలిటీస్ ని ఉపయోగించుకొని మీకు సరైన పాలసీని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. 


ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో సరైన పాలసీని ఎంచుకోవడంలో మీ బైక్ వివరాలు, మీ అవసరాలు అంటే బడ్జెట్‌, ప్రీమియం తదితర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్, మోడల్, సంవత్సరం, ఇతర వివరాలను నమోదు చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ ఎంపికలను చూపిస్తాయి. తక్కువ ప్రీమియంతో అవసరమైన కవరేజ్‌ని అందించే ప్లాన్‌పై దృష్టి పెట్టండి. వేరే సమస్యలేవీ రాకుండా ఉండాలంటే కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వండి. 

బైక్ ఇన్సూరెన్స్ చిట్కాలు

మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కవరేజ్ ని బట్టి పాలసీ సదుపాయాలు పెరగడం, తగ్గడం జరుగుతుంది. థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయితే సొంత నష్టాన్ని కవర్ చేసే సమగ్ర ప్లాన్‌లు ఉంటాయి. వాటిని మీరు గమనించాలి. జీరో డిప్రీసియేషన్ లేదా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి యాడ్-ఆన్‌లు కవరేజ్‌ను కూడా అవి కలిగి ఉంటాయి. IDV ఫీచర్ వల్ల ప్రమాదంలో మీ బండికి నష్టం కలిగినా, దొంగతనం జరిగినా మెరుగైన క్లెయిమ్ అందుతుంది. ఇలాంటి సదుపాయాలున్న పాలసీలను తీసుకోండి. మరింత సమాచారం కోసం ఆన్‌లైన్‌లో ప్రీమియంలను చెక్ చేయండి. 

టూ-వీలర్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్

మంచి క్లెయిమ్ చరిత్ర ఉటే ప్రీమియం ఖర్చులు తగ్గుతాయి. క్లెయిమ్ లేని సంవత్సరాలకు ఇన్సూరర్లు నో-క్లెయిమ్ బోనస్‌లను (NCBలు) అందిస్తారు. దీని వల్ల రీన్యూవల్ పై డిస్కౌంట్స్ లభిస్తాయి. పాలసీ నిబంధనలు, మినహాయింపులు, ప్రయోజనాలను అర్థం చేసుకోవడం వల్ల తక్కువ బడ్జెట్ లో మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీని మీరు తీసుకోవచ్చు. సరైన ఇన్సూరెన్స్ టూ-వీలర్ భద్రతతో పాటు ప్రశాంతంగా వాహనం నడపడానికి సహకరిస్తుంది. 

Latest Videos

click me!