పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ కొనసాగుతోంది. ఈ రేటు ప్రకారం రూ.1 లక్ష పెట్టుబడి ఐదేళ్ల తర్వాత సుమారు రూ.1,40,900కు పెరుగుతుంది. అంటే దాదాపు రూ.40,900 వడ్డీ లభిస్తుంది.
పోస్టాఫీస్ 3 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై కూడా 7.1 శాతం వడ్డీ ఉంది. అదే విధంగా 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7 శాతం, 1 సంవత్సరం టైమ్ డిపాజిట్‌పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ రేట్ల ప్రకారం ఐదేళ్ల కాలానికి అంచనా వేస్తే వరుసగా సుమారు రూ.40,900, రూ.40,250, రూ.39,600 వరకు వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)లో 7.4 శాతం వడ్డీతో ప్రతి నెలా ఆదాయం లభిస్తుంది. ఐదేళ్లలో మొత్తం సుమారు రూ.37,000 వరకు వడ్డీ వస్తుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD)లో 6.7 శాతం వడ్డీతో ఐదేళ్లలో సుమారు రూ.38,300 వరకు రాబడి లభించవచ్చు.