సంక్రాంతి స్పెషల్: Flipkartలో Samsung ఫోన్లపై 50 శాతం వరకు డిస్కౌంట్!

First Published | Jan 5, 2025, 1:05 PM IST

సంక్రాంతి సందర్భంగా కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? Flipkartలో Samsung స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ ఎక్కువైనా, తక్కువైనా, ధర ఎంతైనా 50 శాతం వరకు తగ్గింపుతో అందిస్తున్నాయి. వాటి ధరలు, ఆపర్లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి. 
 

Samsung కంపెనీ వస్తువులకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. నమ్మకమైన, బడ్జెట్ కు అనుకూలమైన బ్రాండ్ గా గుర్తింపు ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లకు అనేక మంది కస్టమర్లు ఉన్నారు. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లు శ్యాంసంగ్ లో ఎక్కువగా ఉంటాయి. ఈ పండుగ సీజన్‌లో మీరు కూడా Samsung ఫోన్‌ కొనాలనుకుంటే Flipkartలో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇక్కడ పరిశీలించండి. 
 

Samsung Galaxy A14 5G

Samsung Galaxy A14 5G ఫోన్‌పై Flipkartలో 45 % డిస్కౌంట్ లభిస్తోంది. అంటే రూ.18,499 ధర ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ. 9,999కే కొనుగోలు చేయవచ్చు. Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనంగా 5 % డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల HD డిస్‌ప్లే, 4 GB RAM, 64 GB స్టోరేజ్, 50 MP మెయిన్ కెమెరా, 13 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. 

6 GB RAM, 128 GB ROM కెపాసిటీ ఉన్న ఇదే Samsung Galaxy A14 5G ఫోన్ పై 42 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంటే రూ.20,999 ఉన్న ఈ ఫోన్ రూ.11,999కే మీరు పొందొచ్చు. 


Samsung Galaxy M35 5G

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ ఫోన్ అసలు ధర రూ. 24,499. ఈ ఫోన్‌పై Flipkartలో 37 % డిస్కౌంట్ ఉంది. అంటే ఈ ఫోన్ ను మీరు రూ. 15,249కే కొనుగోలు చేయవచ్చు. Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే అదనంగా 5 % డిస్కౌంట్ పొందవచ్చు. 

ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల డిస్‌ప్లే, 50 MP రియర్ కెమెరా, 6 GB RAM, 128 GB స్టోరేజ్, 6000 mAh బ్యాటరీ వంటి చక్కటి ఫీచర్లు ఉన్నాయి.
 

Samsung Galaxy F15 5G 

Samsung Galaxy F15 5G ఫోన్‌పై Flipkartలో 14 % డిస్కౌంట్ లభిస్తోంది. అందువల్ల రూ. 16,999 ధర ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ. 14,499కే కొనుగోలు చేయవచ్చు. Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తే అదనంగా 5 % డిస్కౌంట్ లభిస్తుంది. HDFC క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తే రూ. 1000 తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుంది. 

ఈ ఫోన్‌లో 6 GB RAM, 128 GB స్టోరేజ్, 50 MP మెయిన్ కెమెరా, 13 MP సెల్ఫీ కెమెరా, MediaTek Dimensity చిప్‌సెట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

Samsung Galaxy S23 5G

Samsung Galaxy S23 5G స్మార్ట్‌ఫోన్‌పై Flipkartలో 52 % భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని ద్వారా రూ. 89,999 ధర ఉన్న ఈ ఫోన్‌ను రూ. 42,999కే కొనుగోలు చేయవచ్చు. Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తే అదనంగా 5 % డిస్కౌంట్ పొందవచ్చు. 

ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల Full HD డిస్‌ప్లే, 50 MP మెయిన్ కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరా, శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ఉన్నాయి. ఈ ఫోన్ 8 GB RAM, 128 GB ROM మెమొరీ కెపాసిటీని కలిగి ఉంది. 

8 GB RAM, 256 GB ROM కెపాసిటీ ఉన్న ఇదే Samsung Galaxy S23 5G స్మార్ట్‌ఫోన్‌ పై 50 శాతం డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ. 95,999 కాగా, Flipkartలో రూ.47,999 లకే లభిస్తుంది. 

Latest Videos

click me!