పెట్రోల్ బంక్‌లో డబ్బు ఆదా చేయడానికి ఫ్యూయల్ కార్డులు బాగా ఉపయోగపడతాయి. మీకు బైకులు, కార్లు, వ్యాన్లు, లాంటి ఫ్యూయల్ వాహనాలు ఉంటే బంకుల్లో వీటిని ఉపయోగించొచ్చు. మీకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నా ఛార్జింగ్ స్టేషన్లలో కూడా ఈ ఫ్యూయల్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ కాలం వీటిని ఉపయోగించడం ద్వారా మరిన్ని ఆఫర్లు కూడా పొందొచ్చు. ఈ ఆఫర్లు ఉపయోగించుకుంటే మరింత ఎక్కువ డబ్బు మీరు ఆదా చేసుకోవచ్చు.
ఫ్యూయల్ కార్డుల వల్ల కలిగే మంచి బెనిఫిట్ ఏంటంటే ఫిక్స్‌డ్ ధరకు మీరు ఫ్యూయల్ పొందొచ్చు. దీని వల్ల ప్రతి నెలా మీరు ఫ్యూయల్ కోసం ఫిక్స్‌డ్ అమౌంట్ కేటాయించొచ్చు. ఫ్యూయల్ కార్డులు మీ బడ్జెట్ ప్లాన్ ను డిస్టర్బ్ చేయకుండా సహాయపడతాయి. ఫ్యూయల్ కార్డ్ వల్ల పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ తక్కువ ధరకే లభిస్తాయి.
ఫ్యూయల్ కార్డులు ఉపయోగించడం వల్ల బంకుల్లో మీరు వెయింటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని ఫ్యూయల్ కార్డ్‌లు ఇంధన కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి. మరి కొన్ని రివార్డ్ పాయింట్‌లను కూడా అందిస్తాయి. కొన్ని ఫ్యూయల్ కార్డ్‌లు ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపును ఇస్తాయి. ఇది మీకు ప్రతి ఇంధన చెల్లింపుపై 1 - 2.5 % వరకు డబ్బును ఆదా చేస్తుంది.
ఫ్యూయల్ కార్డ్‌లు మీ ఇంధన ఖర్చులను ట్రాక్ చేస్తాయి. తద్వారా మీ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో, పొదుపు మార్గాలను కూడా మీకు తెలియజేస్తాయి. కొన్ని ఫ్యూయల్ కార్డ్‌లు పెట్రోల్ ధరలను ట్రాక్ చేయడానికి అనుమతిస్తాయి. కాబట్టి మీరు ఎక్కడ తక్కువ ఖర్చుతో ఫ్యూయల్ లభిస్తుందో తెలుసుకొని అక్కడ పెట్రోల్ కొట్టించుకోవడం మంచిది.
ఫ్యూయల్ కార్డుల వల్ల మీరు వడ్డీ లేకుండా డబ్బులు ఉపయోగించుకోవచ్చు. అంటే పెట్రోల్ కొట్టించడానికి మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే బిల్లు కట్టే సమయానికి వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది. అదే మీరు ఫ్యూయల్ కార్డు ఉపయోగిస్తే క్రెడిట్ కార్డ్ వడ్డీ ఛార్జీలను కూడా ఆదా చేయవచ్చు.
ఫ్యూయల్ కార్డుల ద్వారా VAT తగ్గింపులు కూడా సులభంగా లభిస్తాయి. మీ ఇంధన ఖర్చులన్నింటికీ HMRC ఇన్‌వాయిస్‌లను పొందవచ్చు. అంతేకాకుండా రసీదుల గురించి చింతించాల్సిన అవసరం లేదు.
BPCL SBI, ఇండియన్ ఆయిల్ కోటక్, ICICI HPCL, ఇండియన్ ఆయిల్ HDFC, ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్, IDFC HPCL, HPCL BoB ఎనర్జీ మొదలైన ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఎలాంటి ఫీజు లేకుండా కూడా కార్డులు ఉచితంగా ఇస్తున్నాయి.