ఇదిలా ఉంటే బంగారం ధరలు గత మూడు నెలల డేటా గమనించినట్లయితే భారీగా తగ్గినట్లు చూడవచ్చు. బంగారం ధర ఒక ఔన్స్ 2050 డాలర్లు పలికింది. అక్కడ నుంచి బంగారం ధర వరుసగా పతనం అవుతూ ప్రస్తుతం 1913 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ లెక్కన గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 137 డాలర్లు పతనం అయింది. దీన్ని భారతీయ కరెన్సీలో చూసినట్లయితే 11,365 రూపాయలు తగ్గింది. ట్రెండు ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే బంగారం ధర 1900 డాలర్ల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.