10 లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ
జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇందులో ఇచ్చే గ్రాంట్‌ను రెండు సమాన విడతలుగా అందజేస్తారు. ఈ పథకంలో సబ్సిడీ గరిష్ట పరిమితి రూ. 10 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ఉంటుంది. కోళ్ల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, పందుల పెంపకం, పశుగ్రాసానికి సంబంధించిన పరిశ్రమల స్థాపనకు ఈ సబ్సిడీ ఇస్తున్నారు. ఉదాహరణకు మీరు 50 లక్షల రుణం పొందితే అందులో రూ. 25 లక్షల సబ్సిడీ పొందవచ్చు.