డబ్బు సంపాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. సంపాదించిన డబ్బును సరైన క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక మొత్తంలో మనం డబ్బును కూడపెట్టవచ్చు. ఈ మధ్యకాలంలో డబ్బును పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్న ఉత్తమ మార్గం మ్యూచువల్ ఫండ్ SIP. సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్( SIP) అనేది పెట్టుబడికి క్రమశిక్షణతో కూడిన విధానం. చాలా సింపుల్ గా పెద్దగా నష్టపోకుండా.. నెలనెలా కొంత మొతంతాన్ని పొదుపు చేస్తూ.. ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.
మ్యూచువల్ ఫండ్ సిప్ లను ప్రారంభించేటప్పుడు పెట్టుబడిదారులు ఎంచుకోవడానికి అనేక రకాల ఎంపికలు ఉన్నాయి. వారి ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టోలరెన్స్ ఆధారంగా, పరిశోధన చేసి, ఉత్తమమైన వాటిని ఎంచుకోవడం చాలా అవసరం.
ప్రతి నెలా SIP ద్వారా డబ్బులు పెట్టుబడి పెట్టి… ఎంత కాలంలో కోటి రూపాయలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
నెలకు రూ.5000, రూ.10,000, రూ.20,000 ఇలా మూడు రకాలుగా సిప్ కట్టడం వల్ల.. రూ. కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోగలరో చూద్దాం..
నెలకు రూ. 5,000
కోటి రూపాయలకు చేరుకోవడానికి సమయం: 22 సంవత్సరాలు
మొత్తం పెట్టుబడి: రూ. 13.20 లక్షలు
అంచనా వేసిన రాబడి: రూ. 90.33 లక్షలు
22 సంవత్సరాల తర్వాత మొత్తం విలువ: రూ. 1.04 కోట్లు
నెలకు రూ. 10,000
రూ. 1 కోటికి చేరుకోవడానికి సమయం: 18 సంవత్సరాలు
మొత్తం పెట్టుబడి: రూ. 21.60 లక్షలు
అంచనా వేసిన రాబడి: రూ. 88.82 లక్షలు
18 సంవత్సరాల తర్వాత మొత్తం విలువ: రూ. 1.10 కోట్లు
నెలకు రూ. 20,000
రూ. 1 కోటికి చేరుకోవడానికి సమయం: 14 సంవత్సరాలు
మొత్తం పెట్టుబడి: రూ. 33.60 లక్షలు
అంచనా వేసిన రాబడి: రూ. 80.78 లక్షలు
13 సంవత్సరాల తర్వాత మొత్తం విలువ: రూ. 1.14 కోట్లు