మనిషి మరణం గురించి చెప్పే AI యాప్ గురించి విన్నారా? ఇదిగో ఆ యాప్

First Published | Dec 1, 2024, 6:36 PM IST

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోతోందంటే.. ఏ వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడో కూడా చెప్పేస్తోంది. మీకు కావాలంటే మీ ఆయుష్షు గురించి చెప్పడానికి ఓ యాప్ సిద్ధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఈ యాప్ వినియోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఈ యాప్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయంకరంగా అప్ డేట్ అవుతోంది. మనిషి జీవనశైలి, అలవాట్ల ఆధారంగా అతని ఆయుష్షును అంచనా వేసే సామర్థ్యాన్ని సంపాదించేసింది. జూలై 2024 లో డెత్ క్లాక్ పేరుతో ప్రారంభమైన ఈ యాప్ ఇప్పటికే 1,25,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలన్న ఉత్సాహంతో కొందరు, ఆయుష్షు పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చేే సలహాలు తీసుకొనేందుకు కొందరు ఈ యాప్ ఉపయోగిస్తున్నారు. 

డెత్ క్లాక్ ఎలా పనిచేస్తుంది

బ్రెంట్ ఫ్రాన్సన్ అనే వ్యక్తి ఈ డెత్ క్లాక్ యాప్ ను అభివృద్ధి చేశారు. ఈ యాప్ 53 మిలియన్ల మందిని జీవనశైలిని పరిశీలించింది. ఎక్కువ కాలం జీవించిన 1,200 మంది కంటే ఎక్కువ మంది ఆహారపు అలవాట్లను పరిశీలించింది. ఈ డేటాను ఉపయోగించి తమ ఆయుష్షు గురించి, మరణం ఎప్పుడు కలుగుతుందో  కూడా చెప్పేస్తోంది. అంతేకాకుండా ఆయుష్షు పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వ్యాయామ దినచర్యలు ఎలా ఉండాలి? ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? నిద్ర విధానాలు వంటి జీవనశైలి అంశాలను వారికి వివరంగా చెప్పి సూచనలు ఇస్తుంది. 


ఆరోగ్య సంపద

ఈ భూమి మీద ఎంతకాలం జీవించే అవకాశం ఉందో తెలిస్తే ఆటోమెటిక్ గా ఆయుర్ధాయం పెంచుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. దీని వల్ల వారు ఆరోగ్యం, ఫిట్‌నెస్ పై శ్రద్ధ పెడతారు. అందువల్ల ఈ యాప్ ఓ రకంగా వ్యక్తుల మరణాన్ని చెప్పి, అది రాకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలో చెబుతుండటం మంచి విషయం అని వినియోగదారులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాల్లో వెల్లడిస్తున్నారు. 

ఫైనాన్సియల్ ప్లానింగ్

జీవన శైలి, శరీర తత్వం, ఫుడ్ హ్యాబిట్స్ ఇలా మనిషి లక్షణాల ఆధారంగా ఈ యాప్ వ్యక్తి మరణం గురించి అంచనా వేయడం అతనిలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని కొందరు నిపుణుల అభిప్రాయం. దీని వల్ల ఆ వ్యక్తి తన ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మారుతుందని చెబుతున్నారు. సమయం ఎంత ఉందో ముందే తెలిస్తే ఈ భూమి మీద ఎలా బతకొచ్చో ఓ అంచనాకు రావచ్చు. తక్కువ సమయం ఉంటే అనవసరంగా కోట్లు కోట్లు దాచేయాల్సిన అవసరం ఉండదు. ఉన్నదాంట్లో ఖర్చు పెట్టుకొని బతకడం వల్ల సంతోషంగా, ఆనందంగా జీవించ వచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్య సూచన..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనిషి ఆయుర్ధాయాన్ని అంచనా వేస్తోంది. కాని ఇండియాలో జ్యోతిష్య శాస్త్రం ఈ పని ఎప్పుడో చేసింది. అయినా డెత్ క్లాక్ యాప్ లెక్కలు కేవలం ప్రణాళికల ఆధారంగా ఉంటాయి. వాటిని పూర్తిగా నిజంగా తీసుకోకూడదు.

Death Clock App వినియోగదారులకు వినోదం అందిస్తోంది. కొందరు ప్రేరణగా తీసుకొని జీవించే విధానాలను మార్చుకుంటున్నారు. ఆత్మపరిశీలన సాధనంగా ఈ యాప్ పనిచేస్తోంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ కి ఆదారణ పెరుగుతోంది. 

Latest Videos

click me!