డబ్బులు దాచుకోవడానికి అనేక మార్గాలుంటాయి. అయితే సేవింగ్స్ లోనూ వడ్డీ పొందాలంటే కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిలో సరైన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ప్రతి నెల కొంత అమౌంట్ దాచుకోవాలంటే SIP (Systematic Investment Plan) ఒక మంచి మార్గం.
SIP అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెల పెట్టుబడి పెట్టే విధానం. ఇది ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను క్రమపద్ధతిలో సమీకరించడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని వడ్డీ రూపంలో పొందే అవకాశం ఇస్తుంది. SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మార్కెట్ హెచ్చుతగ్గులపై ప్రభావం లేకుండా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. లాంగ్ టర్మ్ లో SIP నుంచి ఎక్కువ రాబడి వస్తుంది.
మీ పెట్టుబడిని దీర్ఘకాలంలో పెంచుకోవాలనుకుంటున్నారా? SIP అనే క్రమ పెట్టుబడి పథకంలో రోజు రూ.100 కంటే తక్కువ పొదుపు చేసి కోట్లు సంపాదించొచ్చు. ఉద్యోగి అయినా, వ్యాపారస్తుడైనా SIP పెట్టుబడి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాదినిస్తుంది. ఇప్పుడు రోజూ రూ.100 చొప్పున సేవ్ చేస్తే ఎన్ని సంవత్సరాల్లో ఎంత డబ్బు వస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
రోజు రూ. 100: ఈ కాలంలో SIP చక్కని పెట్టుబడి మార్గం. రోజు రూ. 100 పొదుపు చేసి మ్యూచువల్ ఫండ్స్ SIPలో పెడితే 10, 20, 30, 40 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందో SIP కాలిక్యులేటర్ తో లెక్కించవచ్చు.
10 ఏళ్ల SIP: రోజు రూ. 100 పొదుపు చేస్తే నెలకు రూ. 3000 SIP అవుతుంది. సంవత్సరానికి పెట్టుబడి రూ. 3,60,000 అవుతుంది. ఇది 12 % రాబడి వస్తే 10 ఏళ్లలో రూ. 6,97,017 అవుతుంది. అంటే లాభం రూ. 3,37,017 అన్న మాట.
20 ఏళ్ల SIP: రోజు రూ. 100 పొదుపు చేసి 20 ఏళ్ల పాటు SIP లో పెట్టుబడి పెడితే 20 ఏళ్లకి మొత్తం పెట్టుబడి రూ. 7,20,000 అవుతుంది. 12 % రాబడితో మీరు మొత్తం రూ. 29,97,444 నిధిని సమకూర్చుకోవచ్చు. అంటే లాభం రూ. 22,77,444.
30 ఏళ్ల SIP: 30 ఏళ్లు రోజు రూ. 100 పొదుపుతో SIP చేస్తే మొత్తం పెట్టుబడి రూ. 10,80,000 అవుతుంది. 30 ఏళ్ల తర్వాత రూ.1,05,89,741 నిధిని సమకూర్చుకోవచ్చు. అంటే లాభం రూ. 95,09,741 అన్నమాట. అంటే 30 ఏళ్లకి మీరు కోటీశ్వరుడు అయిపోతారు.
40 ఏళ్ల SIP: 40 ఏళ్లు రోజు రూ.100 పొదుపుతో SIP చేస్తే రూ.14,40,000 పెట్టుబడి అవుతుంది. దీనికి మీరు రూ. 3,56,47,261 రిటర్న్స్ పొందుతారు. లాభం రూ. 2,12,47,261.
మీరు గాని 20 ఏళ్ల వయసులో రూ. 3000 నెలవారీ SIP మొదలుపెడితే 60 ఏళ్లకు రూ. 3.5 కోట్లు మీ సొంతం. SIP దీర్ఘకాలంలో మంచి రాబడి ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్ కి లోబడి ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి.