మార్కెట్లో తగ్గిపోయిన చిన్న నోట్లు.. ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం

First Published | Sep 25, 2024, 10:30 AM IST

మీరు గమనించారో లేదో  ఈ మధ్యకాలంలో మార్కెట్లో చిన్న నోట్లు కనిపించడం లేదు.  దాదాపు అందరూ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్సే చేస్తున్నారు. వాడాల్సి వస్తే.. పెద్ద నోట్లు అంటే రూ.100, రూ.500 వాడేస్తున్నారు. మరి.. ఈ చిన్న నోట్లు లేకపోవడం వల్ల.. సామాాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. 

ఒకప్పుడు డబ్బు లావాదేవీలన్నీ నోట్ల మార్పిడితోనే జరిగేది. కానీ.. ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తుంది. దీంతో.. అందరూ  ఆన్ లైన్ లోనే డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. కానీ.. ఈ క్రమంలో మార్కెట్లో చిన్న నోట్లు కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా  ₹10, ₹20, ₹50 నోట్లు అసలు కనిపించడం లేదు.  ఈ క్రమంలో... నోట్లను ముద్రించడం ఆర్బీఐ ఆపేసిందంటూ ఆరోపణలుు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ స్పందించారు. మార్కెట్లో చిన్న నోట్ల కొరతపై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్బీఐ ఈ నోట్ల ముద్రను ఆపేసిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ కి ఆయన లేఖ కూడా రాయడం గమనార్హం. చిన్న నోట్ల కొరత కారణంగా.. పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

₹10 నోట్ల కొరత

ఈ చిన్న నోట్ల కొరతను తీర్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన నిర్మలాసీతారామన్ ని కోరారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కరెన్సీలో రూ.500 నోట్ల వాటా మార్చి 2024 నాటికి 86.5 శాతంగా ఉంది. మార్చి 31, 2024 నాటికి రూ.500నోట్లు 5.16లక్షల కోట్ల రూపాయలతో అత్యధికంగా ఉన్నాయి. 2.49లక్షల కోట్ల రూపాయాలతో 10 రూపాయల నోట్లు రెండో స్థానంలో ఉన్నాయి. అయితే.. చిన్న నోట్ల కొరత పై మాత్రం కంటిన్యూస్ గా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.


₹50 నోట్ల కొరత

2023-24 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ₹5,101 కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో, ఒక సంవత్సరం క్రితం అంటే 2022-23లో ఇదే కాలంలో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ₹4,682 కోట్లు ఖర్చు చేసింది. మాణికం ఠాకూర్ ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో, “ఆర్థిక మంత్రి గారూ, కోట్లాది మంది పౌరులను, ముఖ్యంగా గ్రామీణ , పట్టణ పేద వర్గాలను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన సమస్యపై మీ దృష్టిని ఆకర్షించాలని నేను కోరుకుంటున్నాను. ₹10, ₹20 , ₹50 నోట్ల కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోంది.

₹20 నోట్ల కొరత

UPI , నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ నోట్ల ముద్రణను నిలిపివేసిందని సమాచారం అందిందని ఠాకూర్ తన లేఖలో పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ప్రయత్నం అర్థం చేసుకోదగినదే అయినప్పటికీ, చిన్న డినామినేషన్ నోట్ల ముద్రణను నిలిపివేయడం ద్వారా డిజిటల్ చెల్లింపు మాధ్యమాలకు అలవాటు లేని వారిని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పౌరులకు కనీసా అవసరమైన కరెన్సీని అందుబాటులో ఉంచాల్సిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లేనని ఠాకూర్ రాశారు.

చిన్న నోట్ల కొరత

రోజువారీ లావాదేవీలకు చిన్న నోట్లు చాలా అవసరం. వాటి కొరత చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు , రోజువారీ కూలీలు వంటి నగదు లావాదేవీలపై ఆధారపడిన వారికి అనేక ఇబ్బందులను సృష్టిస్తుంది. చిన్న డినామినేషన్ నోట్లను ముద్రించి, సరఫరా చేయాలని రిజర్వ్ బ్యాంక్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించాలి. ప్రజల అవసరాలను తీర్చేందుకు ఈ నోట్లు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడాలి” అని ఆయన కోరారు.

Latest Videos

click me!