Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులకు పండగే.. అదిరిపోయే ఫీచర్లతో తొలి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది

Published : Feb 28, 2025, 07:30 AM IST

Royal Enfield Electric Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులకు గుడ్ న్యూస్. రాయల్ ఎన్ ఫీల్డ్ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ C6ను ఇండియా మార్కెట్లోకి తెచ్చింది. మరి వినియోగదారులకు నచ్చేలా ఎలాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయో తెలుసుకుందాం రండి. 

PREV
15
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులకు పండగే.. అదిరిపోయే ఫీచర్లతో తొలి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది

ఏదేమైనా రాయన్ ఎన్ ఫీల్డ్ లుక్కే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది కదా.. పెద్ద ట్యాంకుతో ప్రత్యేకమైన ఇంజిన్ సౌండ్ తో రోడ్డు పై వెళుతుంటే సింహం లా కనిపించేది. దాన్ని నడిపే వారిలో కూడా రాజసం ఉట్టిపడేది. అయితే భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాల హవానే నడుస్తుంది. ఇప్పటికే మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ ను తీసుకురావడం నిజంగా శుభవార్తే. మరి పెట్రోల్ వేరియంట్ లో ఉన్న ఫీచర్లు ఇందులో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం.

 

25

చూడటానికి పాష్ లుక్ తో కనిపించే రాయల్ ఎన్ ఫీల్డ్  ఎలక్ట్రిక్ వెర్షన్ బైక్ ని రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీ కోసం కట్టిన ఫ్లయింగ్ ఫ్లీ స్ఫూర్తితో తయారు చేశారు. రెట్రో డిజైన్‌తో ఉండే ఈ బైక్ ఏకంగా 300 సీసీ ఇంజిన్‌ ని కలిగి ఉంది.

ఒక్క ఛార్జ్‌తో 200 కి.మీ వరకు పరుగులు పెడుతుంది. హిమాలయన్ 450, గొరిల్లా 450లో ఉన్నట్టు రౌండ్ TFT కన్సోల్ కూడా  రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెర్షన్ లో ఉంది. ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే..  ఇది స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్పీడ్, బ్యాటరీ లెవెల్ తదితర అద్భుతమైన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 

35

మొదటి ఎలక్ట్రిక్ బైక్

ప్రపంచ దిగ్గజ కంపెనీ రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ బైక్ పేరు ‘‘ఫ్లయింగ్ ఫ్లీ C6’’. దీని డిజైన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ పాత మోడల్స్‌ను గుర్తుకు తెస్తుంది. లాంగ్ హ్యాండిల్ బార్ దీని ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇందులో రౌండ్ LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. షాట్‌గన్ స్టైల్ సీటు దీనికి  ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది.

45

దూర ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్

సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్ అంటే లాంగ్ టూర్ వెళ్లడం కష్టం అనుకుంటారు. ఛార్జింగ్ పెట్టడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చాలామంది లోకల్ అవసరాల కోసం మాత్రమే ఎలక్ట్రిక్ బైక్స్ కొంటుంటారు. అయితే రాయల్ ఎన్ ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 మీకు లాంగ్ టూర్స్ కి వెళ్లడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని ట్యాంక్‌పై  ఎమర్జెన్సీ సేఫ్టీ స్విచ్ ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ద్వారా ఇది పనిచేస్తుంది. 3.5 అంగుళాల టచ్ ప్యానెల్, 4G, బ్లూటూత్, వై-ఫై తదితర అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

55

అంతేకాకుండా క్రూయిజ్ కంట్రోల్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, కీలెస్ ఇగ్నిషన్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి భవిష్యత్తు అవసరాలు తీర్చే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎకో, రెయిన్, టూర్, పెర్ఫార్మెన్స్, కస్టమ్ అనే రైడింగ్ మోడ్‌లు మీకు పరిసరాలు, వాతావరణానికి అనుగుణంగా డ్రైవ్ చేయడానికి సహకరిస్తాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ధర ఇండియాలో సుమారు రూ.4.5 లక్షల నుంచి ఉంటుందని సమాచారం.

ఇన్ని అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చిన కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెర్షన్ ని మరి వెంటనే మీ ఇంటికి తెచ్చేసుకోండి. 

Read more Photos on
click me!

Recommended Stories