BSNL: రూ.5 కంటే తక్కువకే అన్‌లిమిటెడ్ కాల్స్.. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ అదిరిపోయిందిగా..

Published : Feb 27, 2025, 06:07 PM IST

BSNL: బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రోజుకు రూ.5 కంటే తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకొనే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ రీఛార్జ్ వ్యాలిడిటీ, ఇతర వివరాలు తెలుసుకుందాం రండి. 

PREV
15
BSNL: రూ.5 కంటే తక్కువకే అన్‌లిమిటెడ్ కాల్స్.. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ అదిరిపోయిందిగా..

భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్‍‍‍-ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు టెలికాం రంగంలో దూసుకుపోతున్నాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL ఇటీవల ప్రైవేటు సంస్థలకు పోటీగా ఆఫర్లు ప్రకటిస్తూ కొత్త వినియోగదారులను కూడా ఆకర్షిస్తోంది. అందుకే సుమారు ఆరు నెలలుగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

25

కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి BSNL ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ తీసుకొస్తోంది. మెరుగైన సేవలను అందించడానికి ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4G సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవలే టాటా కంపెనీతో కలిసి దేశవ్యాప్తంగా టవర్ల నిర్మాణం వేగవంతం చేసింది. ఇప్పటికే 65,000 అందుబాటులోకి వచ్చాయి. ఈ సంఖ్యను త్వరలో 1,00,000 కు పెంచాలని బీఎస్ఎన్ఎల్ ప్రయత్నాలు చేస్తోంది. 

35

ప్రైవేట్ టెలికాం సంస్థలు టారిఫ్ ధరలు పెంచితూ తమ ఖాతాదారులను కోల్పోతుంటే బీఎస్ఎన్ఎల్ మాత్రం తక్కువ ధరకే సూపర్ ప్లాన్స్ ప్రకటిస్తూ పోటీ కంపెనీల వినియోగదారులను కూడా ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల బీఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అపరిమితమైన కాల్స్ చేసుకోవచ్చు. అదే రూ.439 రీఛార్జ్ ప్లాన్. 

 

45

ఇటీవలే BSNL తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ఈ రూ.439 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వివరాలను ప్రకటించింది. ఈ ఆఫర్ లో ప్రత్యేకతలేంటంటే.. ఇది రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు దేశం అంతటా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఢిల్లీ, ముంబైలోని MTNL ప్రాంతాలతో సహా ఉచిత రోమింగ్‌ సేవలు ఆస్వాదించవచ్చు. 

 

55

రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ సేవలతో పాటు రోజుకు 300 ఉచిత SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. అంటే సుమారుగా 3 నెలలు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు రూ.4.90 ఖర్చు అవుతుంది. అంటే రూ.5 కంటే తక్కువకే అన్ లిమిటెడ్ కాలింగ్ సేవలు పొందవచ్చు. అయితే ఈ రీఛార్జ్‌తో ఎలాంటి ఇంటర్నెట్ డేటా రాదని గుర్తుంచుకోవాలి. 

click me!

Recommended Stories