Countries Using Rupees: ఇండియాలోనే కాదు.. ఆ దేశాల్లో కూడా కరెన్సీ రూపాయే

Published : Feb 28, 2025, 07:00 AM IST

Countries Using Rupees: మన దేశంలో వినియోగించే కరెన్సీ రూపాయి కదా.. ఇంకా కొన్ని దేశాల్లో కూడా రూపాయే వాడతారు. కాని మన రూపాయి, వాళ్ల రూపాయి వేరు. ఇండియా లాగే రూపాయి కరెన్సీగా ఉన్న ఇతర దేశాలు, వాటి విశిష్టతలు తెలుసుకుందాం రండి. 

PREV
16
Countries Using Rupees: ఇండియాలోనే కాదు.. ఆ దేశాల్లో కూడా కరెన్సీ రూపాయే

కరెన్సీకి ఒక్కో దేశంలో ఒక్కో పేరు, విలువ ఉంటాయి. అమెరికాలో డాలర్స్, రష్యాలో రూబెన్స్, చైనాలో యువాన్ ఇలా ఒక్కో దేశంలో ఒక్కో పేరు ఉంటుంది. కాని మన దేశంలో లాగే కొన్ని దేశాల్లో మాత్రం రూపాయినే కరెన్సీగా వాడతారు. అయితే రూపాయికి ముందు ఆయా దేశాల పేర్లు కలిపి పిలుస్తారు. పేరు ఒకటే అయినా విలువ మాత్రం ఎక్కడిక్కడ మారుతుంది.

 

26

పాకిస్తాన్ కరెన్సీ

భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్‌లో కూడా కరెన్సీని రూపాయి అనే అంటారు. కాని అది పాకిస్తానీ రూపాయి(PKR) అన్నమాట. అంటే ఇండియాలో 1 రూపాయి పాకిస్తాన్ లో సుమారు 3 రూపాయాలకు పైగా ఉంటుంది. అంటే 1 లక్ష రూపాయలు తీసుకొని పాకిస్తాన్ వెళితే అక్కడ రూ.3.33 లక్షల పాకిస్తానీ రూపాయలు  వస్తాయి. 

36

నేపాల్ కరెన్సీ

ఇండియా పక్కనే ఉన్న నేపాల్‌లో కూడా డబ్బు రూపాయి పేరుతోనే వాడుకలో ఉంది. ఆ దేశం నేపాల్ కాబట్టి నేపాల్ రూపాయి(NPR) అని పిలుస్తారు. ఇండియాకు చెందిన 1 రూపాయి నేపాల్ లో దాని విలువ సుమారు 1.60 నేపాల్ రూపాయలుగా ఉంటుంది. పాకిస్తాన్ తో పోలిస్తే నేపాల్ కరెన్సీ మరీ అంత దారుణంగా పతనం కాలేదనే చెప్పాలి. 

46

శ్రీలంక కరెన్సీ

శ్రీలంకలో వాడే డబ్బును కూడా రూపాయి అనే అంటారు. అయితే అది శ్రీలంక రూపాయి (LKR). భారత దేశ రూపాయి శ్రీలంకలో రూ.3.38 శ్రీలంక రూపాయి అన్నమాట. ఇండియాకు ద్వీపకల్పంగా ఉండే శ్రీలంక ఇటీవల దారుణంగా పతనమైంది. రాజకీయంగా అంతర్గత గొడవల వల్ల డవలప్ మెంట్ లేక నిత్యావసర ధరలు పెరిగిపోయి కొన్నాళ్ల క్రితం ప్రజలు ఏకంగా ఆ దేశ అధ్యక్షుడి ఇంటిపైనే దాడి చేసే పరిస్థితి ఏర్పడింది.  

 

56

మాల్దీవ్స్ కరెన్సీ

టూరిజానికి పేరుగాంచిన మాల్దీవ్స్‌లో వాడే కరెన్సీ పేరు మాల్దీవియన్ రూఫియా (MVR). ఇక్కడ ఒక ఇండియా రూపాయి విలువ 0.17 మాల్దీవియన్ రూఫియాతో సమానం. ఇండియాకు దగ్గరగా ఉండటంతో ఎక్కువమంది ఇండియన్స్ తరచూ మాల్దీవ్స్ కి వెళ్లి నేచర్ ని ఎంజాయ్ చేస్తుంటారు. 

66

మరికొన్ని దేశాల్లోనూ రూపాయే..

మారిషస్ దేశంలో కూడా రూపాయి వాడుకలో ఉంది. ఆ దేశంలో డబ్బు పేరు మారిషియన్ రూపాయి (MUR). రూపాయిని వాడే మరో చిన్న దీవి సీషెల్స్. ఇక్కడ కరెన్సీని సీషెలోయిస్ రూపాయి (SCR) అంటారు. ఇండోనేషియా కూడా రూపాయిని వాడుతుంది. ఇండోనేషియన్ రూఫియా (IDR) పేరుతో ఇండోనేషియాలో రూపాయి వాడుకలో ఉంది.

click me!

Recommended Stories