నిరుద్యోగులకు ఉబెర్‌ గుడ్‌ న్యూస్‌.. త్వరలో హైదరాబాద్‌, బెంగళూరులులో భారీగా నియమకాలు...

First Published Jun 9, 2021, 2:43 PM IST

దేశంలో ఇంజనీరింగ్ అండ్ ఉత్పత్తి  పరిధిని విస్తరించే ప్రయత్నంలో  బెంగళూరు, హైదరాబాద్‌లో  250 మంది ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్  ఉబెర్  బుధవారం తెలిపింది.
 

ఈ నియామకం కంపెనీ రైడర్ అండ్ డ్రైవర్ వృద్ధి, డెలివరీ, ఈట్స్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్ కంప్లైయెన్స్, మార్కెట్ ప్లేస్, మౌలిక సదుపాయాలు, డేటా, సేఫ్టీ అండ్ ఫైనాన్స్ టెక్నాలజీ టీం బలోపేతం చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
undefined
ఉబెర్ సీనియర్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) మణికందన్ తంగరత్నం మాట్లాడుతూ ఈ సంవత్సరం చివరి నాటికి, ఈ కేంద్రాల్లోని ఉద్యోగులసంఖ్య 1,000 మందికి తాకే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి సేవ చేయడానికి, మేము మా బృందాలను విస్తరిస్తున్నాము" అని అన్నారు.
undefined
కొత్త టీంలను నిర్మించటానికి, ఉబెర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈట్స్, మార్కెట్ ప్లేస్, రిస్క్ అండ్ పేమెంట్స్, ఉబెర్ ఫర్ బిజినెస్ (యు 4 బి), మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్‌లతో సహా ప్రస్తుత నియమకాలను చేర్చుకోవడం ప్రారంభించినట్లు ఉబెర్ తెలిపింది.
undefined
సామాజిక దూరం పాటించే చర్యలను సులభతరం చేయడానికి ఉబెర్ ఇంజనీర్లు అన్నీ దేశాలలో డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేస్తున్నారు. అలాగే డ్రైవర్ ఆన్‌బోర్డింగ్ అండ్ డిజిటల్ మెనూలను అప్‌లోడ్ చేయడంతో సహా ఉబెర్ అనేక భాగాలను డిజిటలైజ్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ (ML) ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగిస్తున్నారు.
undefined
undefined
click me!