లెజెండరి డైరెక్టర్ ని కోల్పోయిన ఫిల్మ్ ఇండస్ట్రి.. సూపర్ మ్యాన్, గూనీస్ డైరెక్టర్ రిచర్డ్ డోనర్ మృతి..

First Published Jul 6, 2021, 12:09 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రి  మరో దిగ్గజ డైరెక్టర్ ని కోల్పోయింది. హాలివిడ్ లో తనదైన శైలిలో చెరిగిపోని ముద్రా వేసి అద్భుతమైన చిత్రాలను అందించిన ప్రముఖ  దర్శకుడు రిచర్డ్ డోనర్(91) కన్నుమూసారు.  రిచర్డ్ డోనర్ సూపర్ మ్యాన్, గూనీస్ వంటి ఎన్నో సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలను  డైరక్షన్ చేసి తెరకెక్కించారు. 

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రిచర్డ్ సోమవారం కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1960లో టీవీల్లో ‘ట్విన్ లైట్ జోన్’ అనే స్పై థ్రిల్లర్ స్టోరీస్‌తో తన బుల్లితెర ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. న్యూయార్క్ లోని బ్రోనెక్స్ లో రిచర్డ్ డోనర్ జన్మించారు.
undefined
1970ల మధ్యకాలంలో అతనికి హాలీవుడ్‌లో తగిన గుర్తింపు లభించింది. 1978లో క్రిస్టోఫర్ రీవ్ నటించిన సూపర్ మ్యాన్ చిత్రం అతను డైరక్షన్ చేసిన మొదటి మోడ్రన్ సూపర్ హీరో మూవీ. ఈ సినిమా అతనికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. దీని తర్వాత పలు సినిమాలు కూడా తెరకెక్కాయి.
undefined
తెలుగుతో పాటు హిందీలో కూడా సూపర్ మ్యాన్ స్టోరీతో పాటు పలు చిత్రాలు తెరకెక్కాయి. 1985లో ఈయన డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన ‘గూనీస్'కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కొంత మంది పిల్లలు ఎక్కడో ఉన్న గుప్త నిధులను ఎలా కనుగొన్నారనేది ఈ సినిమా స్టోరీ. హాలీవుడ్‌లో ఈ అడ్వెంచర్ డ్రామాకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
undefined
అంతేకాదు ప్రపంచ సినిమా చరిత్రలో ‘గూనీస్’ కల్డ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. సూపర్ మ్యాన్ కంటే ముందు ఈయన 1976లో ‘ఫ్రీ విల్లీ అండ్ లాస్ట్ బాయ్స్’ దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. డోనర్ తన భార్య లారెన్ షులర్ తో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సుదీర్ఘ కాలం కొనసాగారు. అతను డైరెక్ట్ చేసిన చివరి సినిమా 2006లో వచ్చిన 16 బ్లాక్స్.
undefined
రిచర్డ్ డోనర్‌ మరణ వార్తాతో చాలా మంది సోషల్ మీడియాలో నివాళి అర్పించారు. రిచర్డ్ డోనర్ నిర్మించిన లెథల్ వెపన్ సినిమాతో పాటు కాన్స్పిరసీ థియోరిలో నటించిన హీరో మెల్ గిబ్సన్ మాట్లాడుతూ రిచర్డ్ డోనర్ గొప్ప వ్యక్తి, అతను ఎంతోమందికి ఉదాహరణగా ఎప్పటికీ నిలుస్తాడు. అతనికి కోల్పోవడం తీరని లోటు అని అన్నారు.
undefined
click me!