రిలయన్స్ కొత్త బాస్.. ముకేష్ అంబానీ చిన్న కొడుకుకి కీలక భాద్యతలు..

First Published Jul 5, 2021, 5:46 PM IST

 ఆసియా అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ  క్లీన్ ఎనర్జి భాధ్యతలు  అతని  కుమారుడు అనంత్ అంబానీ అప్పజెప్పారు. ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ గ్రూప్  చెందిన రెండు సోలార్ కంపెనీల డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 

రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ బాధ్యతలు స్వీకరించారు. దీనికిముందు ఫిబ్రవరి 2021లో రిలయన్స్ ఆయిల్ టు కెమికల్ వ్యాపారానికి డైరెక్టర్‌గా అనంత్‌ నియమితులయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం జూన్ 24న రిలయన్స్ ఆన్యువల్ జనరల్ మీటింగ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గ్రీన్ ఎనర్జీ కోసం కొత్త కంపెనీని ప్రకటించారు. ఇందుకోసం 60 వేల కోట్ల నిధిని ప్రకటించి, క్లీన్ ఎనర్జీ రెండు సంస్థలకు డైరెక్టర్‌గా అనంత్ అంబానీని నియమించారు.
undefined
జియో ప్లాట్‌ఫామ్‌ల బోర్డులో అనంత్ అంబానీగత నెలలో జరిగిన ఆన్యువల్ జనరల్ మీటింగ్ లో సౌదీ అరామ్‌కో అధినేత రిలయన్స్ ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ డైరెక్టర్ల బోర్డులో చేరారు. సౌదీ అరాంకో ఈ సంస్థలో 20 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చని తెలిపింది. గత సంవత్సరం అనంత్ అంబానీని జియో ప్లాట్‌ఫాంల బోర్డులో చేర్చారు. అయితే ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీ ఇప్పటికే ఈ బోర్డు సభ్యులలో ఉన్నారు.
undefined
ముఖేష్ అంబానీ పెద్దకొడుకు ఆకాష్ అంబానీ వయస్సు 29 సంవత్సరాలు. ఆకాష్ అంబానీ 2019లో జియో ప్లాట్‌ఫాం డైరెక్టర్ల బోర్డులో చేరాడు. అత్తకు ముందు ఏప్రిల్ 2018లో సావన్ మీడియా బోర్డులో చేరారు. అక్టోబర్ 2014లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అండ్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులలో చేరారు.
undefined
అనంత్ అంబానీ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు. ఇతని వయసు 26 సంవత్సరాలు. 21 జూన్ 2021న రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ అండ్ రిలయన్స్ న్యూ సోలార్ బోర్డులలో చేరారు. ఫిబ్రవరి 2021లో రిలయన్స్ ఆయిల్ టు కెమికల్ బిజినెస్ బోర్డు సభ్యుడయ్యాడు. మార్చి 2020లో జియో ప్లాట్‌ఫాంల బోర్డులో చేరారు.
undefined
ముకేశ్ అంబానీ క్లీన్ ఎనర్జి కోసం పెద్ద ప్లాన్టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ అండ్ రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ కాకుండా రిలయన్స్ న్యూ ఎనర్జీ స్టోరేజ్, రిలయన్స్ సోలార్ ప్రాజెక్ట్స్, రిలయన్స్ స్టోరేజ్, రిలయన్స్ న్యూ ఎనర్జీ కార్బన్ వంటి 5 కంపెనీలు ఉన్నాయి. ఫైబర్ అండ్ రిలయన్స్ న్యూ ఎనర్జీ హైడ్రోజన్ ఎలెక్ట్రోలిసిస్ ఏర్పరుస్తాయి. ఈ సంస్థల ఏర్పాటు చూస్తే ముఖేష్ అంబానీ క్లీన్ ఎనర్జికి సంబంధించి ఒక పెద్ద ప్రణాళికతో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం ఏడు కంపెనీలలో 3-3 డైరెక్టర్లు ఉన్నారు. వారిలో ఒక కామన్ డైరెక్టర్ శంకర్ నటరాజన్ కూడా ఉన్నారు.
undefined
click me!