వైద్య రంగంలో ఒక కొత్త హీరో రానున్నాడు. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన డ్రాగన్ కోపైలట్ ఏఐ, రోగులకి బెస్ట్ ఫ్రెండ్ లాగా, డాక్టర్లకి హెల్పర్ లాగా పనిచేయనుంది. ఇది వైద్య పత్రాల్ని ఆటోమేటిక్‌గా చేసి, డాక్టర్ల పని భారాన్ని తగ్గించడంతో పాటు, రోగులకు హెల్ప్ కూడా చేస్తుంది.
డ్రాగన్ కోపైలట్ ఏమేం పనులు చేస్తుంది
మాట్లాడే నోట్స్: డాక్టర్, పేషెంట్ మాట్లాడుకునే మాటల్ని నోట్స్‌లా మారుస్తుంది.
లెటర్స్, రిపోర్ట్స్: సిఫార్సు లెటర్లు, విజిట్ తర్వాత రిపోర్ట్‌లను ఆటోమేటిక్‌గా తయారు చేస్తుంది.
చాలా భాషల్లో నైపుణ్యం: డ్రాగన్ కోపైలట్ కి చాలా భాషలు వచ్చు. అందువల్ల ఏ భాష మాట్లాడినా అర్థం చేసుకుని పనిచేస్తుంది.
రహస్యంగా ఉంచుతుంది: పేషెంట్ల వైద్య సమాచారాన్ని సేఫ్‌గా, ఇతరులకు తెలియకుండా రహస్యంగా ఉంచుతుంది.
పర్సనల్ అసిస్టెంట్: డాక్టర్లకు కావాల్సిన వైద్య సమాచారాన్ని వెంటనే అందిస్తుంది.