Retirement Plan: ముందస్తు రిటైర్మెంట్ ప్లానింగ్: రూ. 5 కోట్ల నిధిని సాధించడం ఎలా.?

Published : May 04, 2026, 09:00 AM IST

Retirement Plan: మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా ఇప్పటిలాగే విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారా? అయితే దానికి కేవలం పొదుపు చేస్తే సరిపోదు, సరైన ప్లానింగ్ ఉండాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా.. 

PREV
15
ముందస్తు రిటైర్మెంట్ ప్లానింగ్:

చాలామంది రిటైర్మెంట్ గురించి 50 ఏళ్లు దాటాక ఆలోచిస్తారు. కానీ, బిజినెస్ నిపుణుల ప్రకారం.. మీరు ఎంత త్వరగా ప్లానింగ్ మొదలుపెడితే, అంత తక్కువ ఒత్తిడితో పెద్ద మొత్తాన్ని వెనక వేయవచ్చు.

25
ద్రవ్యోల్బణం అనే సైలెంట్ కిల్లర్:

ఈరోజు మీ నెలవారీ ఖర్చు రూ. 50,000 ఉంటే, మరో 20 ఏళ్ల తర్వాత అదే జీవనశైలిని కొనసాగించాలంటే మీకు కనీసం రూ. 2 లక్షలు అవసరమవుతాయి. దీనినే ద్రవ్యోల్బణం అంటారు. మీ రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఈ పెరుగుతున్న ఖర్చులను లెక్కలోకి తీసుకోకపోతే, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

35
ఏ ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టాలి..

5 కోట్ల రూపాయలు సాధించడానికి ప్రతి నెలా ఎంత పొదుపు చేయాలి, ఏ ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టాలి అనే స్పష్టమైన ప్రణాళికను సిద్దం చేసుకోవాలి. రిటైర్ అయిన తర్వాత కూడా ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు పడేలా చేసే 'సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్' లేదా అద్దెల ద్వారా వచ్చే ఆదాయాన్ని సమకూరేలా ఏర్పాటు చేసుకోవాలి.

45
కాంపౌండింగ్ శక్తిని వాడుకోండి:

చిన్న వయసు నుండే ఎస్‌ఐపి లేదా ఇతర ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు మొదలుపెట్టడం వల్ల 'పవర్ ఆఫ్ కాంపౌండింగ్' మీ సంపదను వేగంగా పెంచుతుంది. నెలకు ఒక చిన్న మొత్తంతో మొదలుపెట్టి, ప్రతి ఏటా ఆ పెట్టుబడిని 10 శాతం పెంచుకుంటూ పోతే, 5 కోట్ల రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం కాదు.

55
పెట్టుబడి ఎక్కడ పెట్టాలి?

కేవలం బ్యాంక్ ఎఫ్డీలపై ఆధారపడకుండా, ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులు ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ లేదా ఇతర అసెట్ క్లాసుల్లో పెట్టుబడులను వైవిధ్యీకరించాలి. మీ రిటైర్మెంట్ నిధి అనేది మీ మనుగడకు మాత్రమే కాదు, మీ తర్వాతి తరానికి ఒక బలమైన పునాదిగా కూడా ఉండాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories