Insurance: ఇన్సూరెన్స్ అంటే అది ఒక పెట్టుబడి అని మీరు భావిస్తున్నారా? పాలసీ కాలపరిమితి ముగిశాక డబ్బులు తిరిగి వస్తాయని ఆశించి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? అయితే మీరు పెద్ద ఆర్థిక తప్పిదం చేస్తున్నట్లేనని హెచ్చరిస్తున్నారు బిజినెస్ నిపుణులు.
మన దేశంలో చాలామంది ఇన్సూరెన్స్ అనగానే "నేను కట్టిన డబ్బులు నాకు వడ్డీతో సహా తిరిగి రావాలి" అని కోరుకుంటారు. ఈ ఆలోచనా దృక్పథమే వారిని తక్కువ కవరేజీ ఉన్న పాలసీల వైపు నడిపిస్తోంది. బిజినెస్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడూ పెట్టుబడి కాకూడదు.
25
మనీ బ్యాక్ పాలసీల మాయాజాలం:
చాలామంది ఏజెంట్లు "మీరు నెలకు ఇంత కడితే, పదేళ్ల తర్వాత మీకు ఇంత వస్తుంది" అని ఆశ చూపి మనీ బ్యాక్ లేదా ఎండోమెంట్ పాలసీలను అమ్ముతారు. కానీ, వీటిలో వచ్చే రాబడి కేవలం 5 శాతం నుంచి 6 శాతం మాత్రమే ఉంటుంది. పైగా, అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఈ పాలసీలు ఇచ్చే పరిహారం ఆ కుటుంబ అవసరాలకు ఏమాత్రం సరిపోదు.
35
టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత:
నిజమైన ఇన్సూరెన్స్ అంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఇందులో మీరు తక్కువ ప్రీమియం చెల్లించి, భారీ మొత్తంలో లైఫ్ కవరేజీని (ఉదాహరణకు కోటి రూపాయలు) పొందవచ్చు.
ఇందులో డబ్బులు తిరిగి రావు కదా అని చాలామంది దీనిని తీసుకోరు. కానీ, కుటుంబ యజమాని లేని సమయంలో ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే సరైన మార్గం.
55
ఇన్సూరెన్స్‌ను ఇన్సూరెన్స్‌లానే..
ఇన్సూరెన్స్‌ను ఇన్సూరెన్స్‌లానే చూడాలి. రక్షణ కోసం టర్మ్ ప్లాన్ తీసుకోండి, డబ్బులు పెరగడం కోసం మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టండి. ఈ రెండింటినీ కలిపి చూస్తే అటు లాభం రాదు, ఇటు సరైన రక్షణ దొరకదు.