రియల్ ఎస్టేట్ కి పచ్చటి నగరంగా దేశ రాజధాని.. ప్రపంచంలోనే 63వ స్థానంలో ఢిల్లీ..

Ashok Kumar   | stockphoto
Published : Sep 29, 2021, 07:28 PM IST

ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో రియల్ ఎస్టేట్ కోసం న్యూఢిల్లీ అత్యంత పచ్చని నగరంగా పేరుపొందింది. ఈ నివేదిక ప్రకారం లండన్, షాంఘై, న్యూయార్క్, పారిస్, వాషింగ్టన్ డి‌సి రియల్ ఎస్టేట్ కోసం ప్రపంచంలోనే టాప్ గ్రీన్ నగరాలుగా నిలిచాయి.

PREV
13
రియల్ ఎస్టేట్ కి పచ్చటి నగరంగా దేశ రాజధాని..  ప్రపంచంలోనే 63వ స్థానంలో ఢిల్లీ..

ఈ ప్రపంచ జాబితాలో న్యూఢిల్లీ 63వ స్థానంలో ఉందని, చెన్నై 224వ స్థానంలో, ముంబై 240వ స్థానంలో, హైదరాబాద్ 245వ స్థానంలో, బెంగళూరు 259వ స్థానంలో, పూణే 260వ స్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
 

23

తన అధ్యయనంలో నైట్ ఫ్రాంక్ ప్రపంచంలోని 286 నగరాలను అనేక పారామితులపై కొలిచింది. ఈ ప్రమాణాలలో బాగా అభివృద్ధి చెందిన ప్రజా రవాణా నెట్‌వర్క్‌లు, పచ్చటి పట్టణ ప్రదేశాలు, పెద్ద సంఖ్యలో గ్రీన్ రేటెడ్ భవనాలు మొదలైనవి ఉన్నాయి. 2022లో భారతదేశం రియల్ ఎస్టేట్ నుండి 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పొందగలదని ఆయన తన ప్రకటనలో తెలిపారు. యూ‌ఎస్, యూ‌కే, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ 2022లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అగ్ర గమ్యస్థానాలుగా ఉండనున్నాయి.
 

33

ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు ప్రారంభమైందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ అన్నారు. ఇది మన దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.

click me!

Recommended Stories