డిజిటల్ హెల్త్ కార్డ్ అంటే ఏమిటి..ఎలా పొందాలి..? దీని ప్రయోజనాలను ఎంటో తెలుసుకోండి..

First Published Sep 29, 2021, 2:25 PM IST

దేశ ప్రజలకు ఆరోగ్య హక్కులు కల్పించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించారు. ఈ మిషన్ కింద దేశ పౌరులు డిజిటల్ హెల్త్ కార్డును పొందువచ్చు. ఈ డిజిటల్ హెల్త్ కార్డు పేద, మధ్య తరగతి కుటుంబాలకు గొప్ప ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. 

 దీనితో పాటు ప్రేస్క్రిప్షన్ నుండి టెస్ట్ రిపోర్ట్‌లు మొదలైన వాటి వరకు ఆసుపత్రిలో తిరగాల్సిన అవసరం ఉండదు. అన్ని ప్రేస్క్రిప్షన్లు డిజిటల్ హెల్త్ కార్డ్  ప్రత్యేక నంబర్ ద్వారా యాక్సెస్ చేయగల సర్వర్‌లో డిజిటల్‌గా సేవ్ చేయబడతాయి. డిజిటల్ హెల్త్ కార్డ్  ముఖ్య ప్రయోజనం ఏమిటంటే అన్ని రకాల వ్యాధులు, ట్రీట్మెంట్ హిస్టరీ ఒకే క్లిక్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు మీ డిజిటల్ హెల్త్ కార్డును ఎలా పొందాలో, దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి..
 

డిజిటల్ హెల్త్ కార్డ్ అంటే ఏమిటి?

డిజిటల్ హెల్త్ కార్డ్ అనేది మీ వ్యాధుల లేదా జబ్బుపడ్డ లేదా అనారోగ్యానికి  గురైన చరిత్ర, ప్రిస్క్రిప్షన్ గురించి పూర్తి సమాచారం డిజిటల్‌గా అందుబాటులో ఉండే కార్డ్ అని గుర్తుంచుకోండి. మీ పేరు, తండ్రి పేరు, చిరునామా మొదలైన మీ గుర్తింపుకు సంబంధించిన పూర్తి సమాచారం ఆధార్ కార్డులో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నట్లే, డిజిటల్ హెల్త్ కార్డ్‌లో కూడా మీ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. మీరు మీ ఆధార్ కార్డును మీ వద్ద ఎలా ఉంచుకుంటారో అదే విధంగా మీరు మీ డిజిటల్ హెల్త్ కార్డును మీ వద్ద ఉంచుకోవచ్చు.
 

మీ అనారోగ్యం, చికిత్స, వైద్య పరీక్షలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒక ప్రత్యేకమైన ఐ‌డి కార్డులాగే డిజిటల్ హెల్త్ కార్డ్ ఉంటుంది. ఈ కార్డుపై మీ 14 అంకెల నంబర్ ఉంటుంది. ఈ నంబర్ నుండి రోగి  వైద్య చరిత్ర తెలుస్తుంది. ఈ డిజిటల్ హెల్త్ కార్డ్‌లో రోగి వైద్య చరిత్రను ఉంచడానికి హాస్పిటల్స్, వైద్యులు సెంట్రల్ సర్వర్‌కు కనెక్ట్ చేయబడి ఉంటారు. దీని కోసం రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు మీ డేటాను 'ఎన్‌డి‌ఎం‌హెచ్ హెల్త్ రికార్డ్స్ యాప్' లో కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ఈ యాప్‌లో అన్ని ఆసుపత్రులు, క్లినిక్‌ల లిస్ట్ ఉంటుంది.
 

డిజిటల్ హెల్త్ కార్డ్  ప్రయోజనాలు ఏమిటి?

డిజిటల్ కార్డు  అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లు, టెస్ట్ రిపోర్టులు మీతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీరు ఏదైనా టెస్ట్ రిపోర్ట్ లేదా ఏదైనా ప్రిస్క్రిప్షన్ ను కోల్పోయినప్పటికీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వద్ద పాత టెస్ట్ రిపోర్ట్ లేకపోయినా మీరు మళ్లీ టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. మీరు దేశంలోని ఏ మూలనైనా చికిత్స పొందినప్పటికీ ఒక డాక్టర్ మీ  ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి ప్రత్యేక గుర్తింపు నంబరుతో తెలుసుకోగలరు.
 

డిజిటల్ హెల్త్ కార్డు ఎలా పొందాలి ?

మీరు మొబైల్ నంబర్ లేదా ఆధార్ కార్డ్ సహాయంతో డిజిటల్ హెల్త్ కార్డును ఆన్‌లైన్‌లో పొందవచ్చు లేదా ఏదైనా  సర్వీస్ కేంద్రం లేదా సైబర్ కేఫ్‌ను సందర్శించి  పొందవచ్చు. మీరు మీ స్వంతంగా కూడా పొందాలనుకుంటే మీ మొబైల్ బ్రౌజర్‌లో ndhm.gov.in అని టైప్ చేయండి. ఇప్పుడు మీరు ఈ వెబ్‌సైట్‌లో "హెల్త్ ఐడి" పేరుతో ఒక టైటిల్ అంటే పేరు చూస్తారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా, మీరు కార్డు నిబంధనలను చదవవచ్చు అలాగే కార్డును పొందవచ్చు.
వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత 'క్రియేట్ హెల్త్ ఐ‌డి' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
కార్డును పొందడానికి ఆధార్ లేదా మొబైల్ నంబర్ ఆప్షన్ ఎంచుకోండి.
ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసిన తరువాత  ఓ‌టి‌పి అందుతుంది.
మీరు ఓ‌టి‌పిని ఎంటర్ చేసి వేరిఫై చేయాలి.
ఇప్పుడు మీ ముందు ఒక ఫారం ఓపెన్ అవుతుంది, దీనిలో మీరు మీ ప్రొఫైల్ కోసం ఫోటో, పుట్టిన తేదీ, చిరునామాతో సహా మరికొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
మొత్తం సమాచారం ఇచ్చిన తర్వాత   డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీ డిజిటల్ హెల్త్ కార్డ్ సిద్ధంగా ఉంటుంది. ఈ కార్డ్‌లో క్యూ‌ఆర్ కోడ్ కూడా ఉంటుంది.

click me!