ముకేష్ అంబానీ చేతికి మరో దిగ్గజ కంపెనీ.. 40.95 శాతం వాటా కోసం రూ .3,497 కోట్లు పెట్టుబడి..

First Published Jul 17, 2021, 11:34 AM IST

ఆసియా అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత బిలియనీర్ ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) ప్రముఖ ఇంటర్నెట్ టెక్నాలజీ బి 2 బి కంపెనీ  జస్ట్ డయల్ లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.

జస్ట్ డయల్‌లో 40.95 శాతం వాటా కోసం రిలయన్స్ రూ .3,497 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అయితే ప్రస్తుత జస్ట్ డయల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వి.ఎస్.ఎస్. మణి తన విధులను ఎప్పటిలాగే కొనసాగిస్తారు. ఆర్‌ఆర్‌విఎల్ పెట్టుబడి జస్ట్ డయల్ వృద్ధి అలాగే విస్తరణ వైపు వెళ్తుంది. దీంతో జస్ట్ డయల్ స్థానిక వ్యాపారాల జాబితాను మరింత బలోపేతం చేస్తుంది.
undefined
జూలై 16న ఒప్పందాల ప్రకారం, రిలయన్స్ రిటైల్ కంపెనీ మార్కెట్ రెగ్యులేటర్ సెబి నిర్దేశించిన టేకోవర్ నిబంధనలకు అనుగుణంగా 26 శాతం వరకు కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ చేస్తుంది.అంటే జస్ట్ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 66.95 శాతం మెజారిటీ వాటాను పొందవచ్చు.
undefined
31 మార్చి 2021 నాటికి జస్ట్ డయల్ డేటాబేస్ లో 30.4 మిలియన్ జాబితా కలిగి ఉంది అలాగే 129.1 మిలియన్ల వినియోగదారులు ఈ త్రైమాసికంలో జస్ట్ డయల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు.
undefined
ఈ ఒప్పందంపై ఆర్‌ఆర్‌విఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ బలమైన వ్యాపారాన్ని నిర్మించిన మొదటి తరం వ్యవస్థాపకుడు విఎస్ఎస్ మణితో భాగస్వామి కావడానికి సంతోషిస్తున్నట్లు చెప్పారు. జస్ట్ డయల్‌లో పెట్టుబడులు సూక్ష్మ, చిన్న ఇంకా మధ్యతరహా పరిశ్రమల కోసం డిజిటల్ పర్యావరణ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి అని అన్నారు.
undefined
click me!