ముకేష్ అంబానీ చేతికి లోకల్ సేర్చ్ కంపెనీ.. డీల్ విలువ ఎంతో తెలుసా..?

Ashok Kumar   | Asianet News
Published : Jul 15, 2021, 07:06 PM IST

దేశంలోని అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ రిటైల్ వ్యాపారంలో  వ్యూహాత్మక లక్ష్యం వైపు  అడుగు వేస్తున్నారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లోకల్ సర్చ్ కంపెనీ జస్ట్‌డయల్ కొనుగోలుపై చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం విలువ 80 నుండి 90 మిలియన్ల డాలర్లు ఉండొచ్చు, అంటే రూ.5,920 కోట్ల నుండి రూ.6,660 కోట్లు. 

PREV
14
ముకేష్ అంబానీ చేతికి లోకల్ సేర్చ్ కంపెనీ..  డీల్ విలువ ఎంతో తెలుసా..?

జూలై 16న బోర్డు సమావేశం
కొన్ని నివేదికల ప్రకారం జూలై 16 జస్ట్‌డయల్ నిధుల సేకరణ ప్రతిపాదనలపై చర్చించడానికి బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. జస్ట్‌డయల్  అనేది 25 ఏళ్ల ఇన్ఫర్మేషన్ సెర్చ్ అండ్ లిస్టింగ్స్ కంపెనీ, దీనికి పాన్-ఇండియా నెట్‌వర్క్‌ ఉంది. 
 
24

రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ప్రయోజనాలు
ఒకవేళ  రిలయన్స్ ఇండస్ట్రీస్ జస్ట్‌డయల్ మధ్య  ఒప్పందం కుదిరితే రిలయన్స్ రిటైల్ జస్ట్‌డయల్ మర్చంట్ డేటాబేస్ నుండి ప్రయోజనం పొందుతుంది.   జస్ట్‌డయల్ లోకల్ సెర్చ్ ఇంజన్ విభాగంలో మార్కెట్ లీడర్. జస్ట్‌డియల్  మొబైల్, యాప్, వెబ్‌సైట్, 8888888888 టెలిఫోన్ హాట్‌లైన్‌ ద్వారా  త్రైమాసికంలో సగటున 150 మిలియన్ల  యూనిక్ విజిటర్స్ కలిగి ఉంది. 
 
34

జస్ట్‌డియల్ ప్రమోటర్ అండ్ అతని కుటుంబం వాటా
జస్ట్‌డియల్ ప్రమోటర్ వి.ఎస్.ఎస్.మణి, అతని కుటుంబానికి సంస్థలో 35.5 శాతం వాటా ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ .2387.9 కోట్లు. ఇప్పుడు రిలయన్స్ వి.ఎస్.ఎస్.మణి నుండి కొంత వాటాను కొనుగోలు చేయలని యోచిస్తోంది. ఇది మాత్రమే కాదు ఓపెన్ ఆఫర్ ద్వారా అదనంగా 26 శాతం వాటాను తీసుకోవచ్చు. ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్ స్క్రిప్షన్ పొందినట్లయితే రిలయన్స్ 60 శాతానికి పైగా వాటాను కలిగి ఉంటుంది అలాగే మణి జూనియర్ భాగస్వామిగా కంపెనీ కార్యకలాపాలలో కొనసాగుతారు.

44

 రిలయన్స్, జస్ట్‌డియల్ షేర్లలో పెరుగుదల
నేడు బి‌ఎస్‌ఈ షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 2.75 పాయింట్లు (-0.13 శాతం) పడిపోయి 2083.25 వద్ద ముగిసింది. జస్ట్‌డియల్ స్టాక్ గత ఆరు నెలల్లో 52.4 శాతం పెరిగింది. ఈ రోజు జస్ట్‌డియల్ స్టాక్ 26.85 (+2.49 శాతం) పెరిగి 1107.00 స్థాయిలో ముగిసింది. ప్రస్తుతం, రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .13,20,664.49 కోట్లు, జస్ట్‌డియల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .6,893.60 కోట్లుగా ఉంది. 

click me!

Recommended Stories