రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. రూ. 198తోనే

Published : Jan 29, 2025, 05:46 PM IST

ప్రముఖ టెలికం సంస్థ జియో యూజర్ల అవసరాలకు అనుగుణంగా అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తోంది. మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో మంచి ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జియో యూజర్ల కోసం కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. రూ. 198తోనే

5జీ నెట్‌వర్క్‌ ఉపయోగించే వారిని దృష్టిలో పెట్టుకొని జియో ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ. 200లోపు మంచి బెనిఫిట్స్ కోరుకునే వారికి ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. కేవలం రూ. 198తో రీఛార్జ్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఈ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్‌ లభిస్తాయి.? వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

24

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ను పొందొచ్చు. ప్రతీ రోజూ 2జీబీ డేటా పొందొచ్చు. 5జీ నెట్‌ కావడంతో వేగంగా బ్రౌజింగ్‌, స్ట్రీమింగ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ప్రతీ రోజూ ఉచితంగా 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. వీటికి అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ వంటి యాప్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుంది. ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తం 28 జీబీ డేటా లభిస్తుంది. 
 

34

జియో రూ. 349తో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే రోజుకు 2 జీబీ 5జీ ఇంటర్నెట్‌తో పాటు రూ. 198 ప్లాన్‌లో ఉన్న అన్ని బెనిఫిట్స్‌ లభిస్తాయి. ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ప్లాన్‌గా చెప్పొచ్చు. 
 

44

ఇక జియో డైలీ ఇంటర్నెట్‌ ప్యాక్‌ ప్లాన్స్‌ను కూడా సవరించింది. యాడ్‌ ఆన్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌లో భాగంగా రూ. 19తో రీఛార్జ్‌ చేస్తే ఒకరోజు వ్యాలిడిటీతో 1 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ. 29 ప్లాన్‌తో 2జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా ప్యాక్‌ రెండు రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. రెండు రోజుల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్స్‌ను జియో యాప్‌ లేదా ఇతర యూపీఐ వ్యాలెట్స్‌లో రీఛార్జ్‌ చేసుకోవచ్చు. 

click me!

Recommended Stories