సినిమాలు ఇష్టంగా చూసే వారు ప్రతి సినిమా థియేటర్ లో చూడాలని ఇష్టపడతారు. కాని డబ్బులు ఎక్కువగా ఖర్చవుతాయి. అందుకే థియేటర్ లాంటి ఎక్సీపిరియన్స్ ఇచ్చే సెటప్ ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా.. ఇలాంటి ఫెసిలిటీని టెక్సాక్స్ లూమా కంపెనీ అందిస్తోంది.
టెక్సాక్స్ లూమా LED ప్రొజెక్టర్ ను తక్కువ ధరకే అందిస్తోంది. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే థియేటర్ లాంటి అనుభూతిని ఇస్తుంది. తేలికైన డిజైన్, స్మార్ట్ ఫీచర్లు, 4K క్వాలిటీతో ఇంటికీ, బయటికీ చాలా బాగుంటుంది. టెక్సాక్స్ లూమా LED ప్రొజెక్టర్ ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇన్స్టాల్ చేయడం కూడా చాలా తేలిక.
సూపర్ డిజైన్
టెక్సాక్స్ లూమా LED చాలా నాణ్యతగా తయారైంది. చిన్నగా, తేలికగా ఉండడంతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. 180 డిగ్రీల వరకు తిప్పవచ్చు. ఇంటికే కాదు, బయట కూడా సినిమాలు చూడటానికి బాగుంటుంది.