నెలకు కేవలం రూ. 112.. సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌, 336 రోజుల వ్యాలిడిటీతో..

First Published | Jan 8, 2025, 10:32 AM IST

ప్రస్తుతం చేతిలో ఫోన్‌ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంది. దీంతో రీఛార్జ్‌ చేసుకోవడం అనివార్యంగా మారింది. ఒకప్పుడు లైఫ్‌టైమ్‌ ఇనకమ్‌ కాల్స్‌ ఉచితంగా ఉండేవి. అయితే ప్రస్తుతం కంపెనీలు రూటు మార్చాయి. కచ్చితంగా యాక్టివ్ ప్లాన్‌ ఉండాలనే రూల్‌ పెట్టాయి. దీంతో నెలనెల రీఛార్జ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. 
 

టెలికం కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా యూజర్లను ఆకట్టుకునే ఉద్దేశంతో తక్కువ ధరతో ఎక్కువ బెనిఫిట్స్‌ ఉండే ప్లాన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ఇందులో ముందు వరుసలో ఉంటోంది ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్‌ జియో. దేశంలో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న టెలికం సంస్థగా పేరు సంపాదించుకున్న జియో యూజర్లను ఆకర్షించే క్రమంలో దూసుకుపోతోంది. 
 

ఇక ప్రతీ నెల రీఛార్జ్‌ చేసుకోవడం ప్రస్తుతం ఇబ్బందిగా మారుతోంది. 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్స్ తక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో తరచూ రీఛార్జ్‌ చేయాల్సి వస్తోంది. ఇది ఇబ్బందితోపాటు ధర కూడా ఎక్కువ కావడానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే జియో తాజాగా మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో తక్కువ ధరలోనే ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది జియో. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 


ఎక్కువ రోజులు వ్యాలిడిటీని కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌ను పరిచయం చేశార. రూ. 1234తో రీఛార్జ్‌ చేసుకుంటే 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే సుమారు 11 నెలల పాటు వ్యాలిడిటీ పొందుతారు. అంటే నెలకు సుమారు రూ. 112 అవుతుందన్నమాట. ఇక బెనిఫిట్స్‌ విషయానికొస్తే ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. 
 

అదే విధంగా రోజుకు ఉచితంగా 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. ఇక ఈ ప్లాన్‌లో మొత్తం 168 జీబీ డేటాను పొందొచ్చు. అంటే రోజుకు 500 ఎంబీ డేటా లభిస్తుంది. డేటా తక్కువ ఉపయోగిస్తూ ఎక్కువ రోజులు టాక్‌టైమ్‌ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచచు. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో జియో సావన్‌తో పాటు, జియో సినిమాలను ఉచితంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు. 
 

వారికి మాత్రమే అవకాశం.. 

అయితే ఈ ప్లాన్ అందరి అందుబాటులో ఉండదు. కేవలం జియో భారత్‌ ఫోన్‌లను ఉపయోగించే వారికి మాత్రమే వర్తిస్తుంది. జియో సిమ్‌లను ఉపయోగిస్తున్న ఇతర స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు ఈ ప్లాన్‌ వర్తించదు. కేవలం జియో భారత్‌ వంటి ఫీచర్‌ ఫోన్‌ను ఉపయోగిస్తున్న వారు మాత్రమే ఈ రీఛార్జ్‌ చేసుకోవడానికి అర్హులు. 
 

Latest Videos

click me!