ప్రస్తుతం ఇండియాలో అతి పెద్ద నోటు అంటే అది రూ.500 మాత్రమే. ఇంతకు మించి పెద్ద నోటు లేదు. రూ.2,000 నోటు ఉన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ నోట్లను వెనక్కు తీసేసుకుంది. వీటిని తిరిగి ప్రింటింగ్ చేయడం కూడా ఆపేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్బీఐ వెల్లడించింది.
దీంతో ఇప్పుడు పెద్ద నోటు అయిన రూ.500 లపై మోసగాళ్ల కళ్లు పడ్డాయి. వీటిని నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్ లోకి వదిలారు. ఇవి అచ్చం ఒరిజినల్ నోట్లలాగే ఉండటంతో ఏది నిజమైనదో, నకిలీ ఏదో తెలియక వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నకిలీ నోటు అచ్చం అసలైన రూ.500 నోటులాగే ఉంటున్నాయి. ఈ తేడాను మామూలుగా గుర్తించడం కష్టం.