ఇస్రో ట్వీట్ కి ఎలాన్ మాస్క్ ఇంట్రెస్టింగ్ రిప్లయి.. గగన్యాన్ ద్వారా మనుషులను అంతరిక్షంలోకి..

First Published Jul 15, 2021, 1:55 PM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం దేశంలోని మొట్టమొదటి హ్యూమన్ మిషన్ అయిన గగన్యాన్ డెవలప్మెంట్ ఇంజన్  థర్డ్ లాంగ్ హీట్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఇస్రో స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపింది. అయితే స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ ఇస్రో  విజయాన్ని అభినందిస్తు రిట్వీట్ చేశారు.
 

తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వద్ద ఈ ఇంజన్ 240 సెకన్ల పాటు నడిచింది. ఈ సమయంలో ఇంజన్ ఆశించిన లక్ష్యాన్ని సాధించింది. గత టెస్ట్ సమయంలో చేసిన అంచనాలతో ఇంజన్ పనితీరు సరిపోతుంది. గగన్యాన్ ద్వారా మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి తీసుకురావడానికి గల అవకాశాలపై ఇస్రో పనిచేస్తోంది.
undefined
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మొట్టమొదటి మానవరహిత గగన్యాన్ మిషన్ ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ప్రారంభించే అవకాశం ఉంది. కరోనా కారణంగా ఈ మిషన్ ఒక సంవత్సరం ఆలస్యంగా జరిగింది. దీని ప్రయోగం 2020 డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. కానీ సరైన సమయంలో హార్డ్‌వేర్ సరఫరా ఆలస్యం కావడంతో, దీనిని హ్యూమన్ రేటింగ్‌గా మార్చడం సాధ్యం కాలేదు.
undefined
హ్యూమన్ రేటింగ్ లాంచ్ వెహికిల్ హార్డ్‌వేర్ రిలయబిలిటీ 0.99 గా పరిగణించబడుతుంది. గగన్యాన్ మిషన్‌లో భాగంగా రెండు మానవరహిత వాహనాలను ఒకదాని తరువాత ఒకటి ప్రయోగించే ప్రణాళికలు ఉన్నాయి. కరోనా మహమ్మారి మొదటి, రెండవ వేవ్ గగన్యాన్ కార్యక్రమాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని బెంగళూరులోని అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయం నుండి ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
undefined
ఇస్రో అధికారి మాట్లాడుతూ, “మిషన్ కోసం హార్డ్‌వేర్‌ను పారిశ్రామిక సంస్థలు తయారు చేస్తున్నాయి. కానీ దేశంలోని వివిధ ప్రాంతాలలో వేర్వేరు సమయాల్లో లాక్ డౌన్ కారణంగా సకాలంలో సరఫరా చేయలేకపోయాము. ఈ హార్డ్‌వేర్‌ డిజైన్, అనలైజ్, డాక్యుమెంట్ ఇస్రో చేత చేయబడింది. గగన్యాన్ హార్డ్‌వేర్‌ తయారీ, సరఫరా కోసం దేశంలోని వందలాది పారిశ్రామిక సంస్థలు పనిచేస్తున్నాయి.
undefined
కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలు, భాగాల సరఫరాలో ఇస్రో ఫ్రెంచ్, రష్యన్, అమెరికన్ అంతరిక్ష సంస్థల సహాయాన్ని తీసుకుంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గగన్యాన్ కార్యక్రమం మానవులను భూమి కక్ష్యలోకి పంపించి, సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడానికి ఇండియన్ లాంచ్ వెహికిల్ లక్ష్యంగా పెట్టుకుంది.
undefined
click me!