కలర్ మ్యాజిక్ టెక్నాలజీతోపాటు తక్కువ ధరకే Realme 14 Pro సిరీస్ ఫోన్లు

First Published | Jan 16, 2025, 4:56 PM IST

రియల్‌మీ 14 ప్రో సిరీస్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్లలో ఉపయోగించిన కలర్ మ్యాజిక్ టెక్నాలజీ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ ఫోన్లు ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతాయి. వాటి ఫీచర్స్, ధరల వివరాలు ఇక్కడ చూద్దాం రండి.

కలర్ మ్యాజిక్ టెక్నాలజీతో రియల్‌మీ 14 ప్రో సిరీస్ ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. బికనీర్ పర్పుల్, జైపూర్ పింక్, పెర్ల్ వైట్, సూయేడ్ గ్రే కలర్స్‌లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. కలర్ మ్యాజిక్ స్పెషాలిటీ ఏంటంటే.. ఈ సిరీస్ ఫోన్లలోని పెర్ల్ వైట్ వేరియంట్ చలికాలంలో నీలిరంగులోకి మారుతుంది. కొత్త టెక్నాలజీతో వస్తున్న ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ చెబుతోంది. రియల్‌మీ 14 ప్రో సిరీస్ స్పెషాలిటీస్ తెలుసుకుందాం. 

రియల్‌మీ 14 ప్రో

రియల్ మీ 14 ప్రో ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉపయోగించారు. 6.74 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కెమెరా విషయానికొస్తే 50 MP ప్రైమరీ కెమెరా, 32 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. లెన్స్ కోసం 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఇందులో ఉపయోగించారు. 256 GB స్టోరేజ్ కెపాసిటీతో పాటు 8 GB RAM ఇందులో ఉంది. 6,000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ ను 67W ఫాస్ట్ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ధర రూ. 24,999. 


రియల్‌మీ 14 ప్రో+ 

6.74 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉపయోగించి రియల్‌మీ 14 ప్రో+ తయారు చేశారు. ఈ ఫోన్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 256 GB, 12 GB RAM. ఇదే కాకుండా 8 GB+128 GB కెపాసిటీ ఉన్న వేరియంట్ కూడా ఉంది. 50 MP OIS ప్రైమరీ సెన్సార్, 50 MP OIS టెలిఫోటో లెన్స్ ఉపయోగించడం వల్ల దీని పనితీరు అద్భుతంగా ఉంటుంది.  8 MP అల్ట్రా వైడ్ లెన్స్, 32 MP ఫ్రంట్ కెమెరా ఇందులో అమర్చారు. బ్యాటరీ విషయానికొస్తే 6000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 80 W ఫాస్ట్ ఛార్జర్ తో మీకు లభిస్తుంది. దీని ధర రూ.29,999 (8 GB+128 GB).

ఏంటీ కలర్ మ్యాజిక్ టెక్నాలజీ

16°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఫోన్ వెనుక కవర్ పెర్ల్ వైట్ నుండి వైబ్రెంట్ బ్లూకి మారుతుంది. ఇలాంటి కలర్ మ్యాజిక్ టెక్నాలజీని రియల్ మీ తన వినియోగదారులకు పరిచయం చేస్తోంది. ఈ సిరీస్ ఫోన్లు జనవరి 23న మార్కెట్లోకి విడుదల కానున్నాయి. 

Latest Videos

click me!