స్మార్ట్ వాచీ కావాలా? Flipkartలో డిస్కౌంట్ ఆఫర్లు చూస్తే ఆశ్చర్యపోతారు

First Published | Jan 16, 2025, 3:25 PM IST

వినియోగదారులను ఆఫర్లతో ఆకర్షించే ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్‌ తో మరోసారి ముందుకొచ్చింది. జనవరి 19 వరకు జరిగే ఈ సేల్ లో మొబైల్ ఫోన్‌లతో పాటు స్మార్ట్‌వాచీలపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌వాచీల ధరలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.

ఫాస్ట్‌ట్రాక్ స్మార్ట్‌వాచ్ 

ఫాస్ట్‌ట్రాక్ రివోల్ట్ FS1 (Fastrack Revoltt FS1 Pro) మోడల్ స్మార్ట్‌వాచ్‌ను ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో కేవలం రూ.1799కి మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌లో 1.96 అంగుళాల Super AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 410 x 502 పిక్సెల్ రిజల్యూషన్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ పరికరాలకు కాల్ కనెక్టివిటీ, SingleSync బ్లూటూత్ కనెక్షన్‌ను అందిస్తుంది. 

ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం వల్ల 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఒక రోజంతా ఉంటుంది. గరిష్టంగా 7 రోజుల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. అంతేకాకుండా 200 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, 110 గేమ్ మోడ్‌లు, AI వాయిస్ అసిస్టెంట్, వెదర్ అప్‌డేట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. 
 

రెడ్‌మి వాచ్ 3

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో రెడ్‌మి వాచ్ 3 (Redmi Watch 3) మోడల్ రూ.1,899కే మీరు దక్కించుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ 1.83 అంగుళాల డిస్‌ప్లే, 450 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Mi ఫిట్‌నెస్ యాప్ సహాయంతో వినియోగదారులు SOS ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఇందులో సైడ్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కు కాల్ చేసే ఫెసిలిటీ ఉంది.  

ఇది మెరుగైన కనెక్టివిటీ, కాల్ ఫీచర్ల కోసం Bluetooth v5.3 (BLE) ని కూడా సపోర్ట్ చేస్తుంది. 200 కంటే ఎక్కువ కస్టమైజ్ చేయగల వాచ్ ఫేస్‌లు, హార్ట్ రేట్ మానిటర్, SpO2, స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ ప్యాటర్న్స్, మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.


బోల్ట్ క్రౌన్ఆర్ ప్రో

బోల్ట్ క్రౌన్ఆర్ ప్రో (Boult CrownR Pro) మోడల్ స్మార్ట్‌వాచ్ రూ.1999కి లభిస్తోంది. ఈ మోడల్‌లో 1.43 అంగుళాల AMOLED HD స్క్రీన్ ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేతో వస్తుంది. SpO2 బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ మానిటరింగ్, 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్, ఉమెన్స్ మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. 

అంతేకాకుండా 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు,  120 కంటే ఎక్కువ గేమ్ మోడ్‌లు, SMS, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు, "Find My Phone" ఫీచర్, AI వాయిస్ అసిస్టెంట్, వెదర్ అప్‌డేట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. 

నాయిస్ విజన్ 3

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.7,999 ధర కలిగిన నాయిస్ విజన్ 3 (Noise Vision 3) స్మార్ట్‌వాచ్‌ను ఇప్పుడు రూ.2,199కి మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌లో 410 x 502 పిక్సెల్ రిజల్యూషన్‌తో సన్నని బెజెల్, 1.96 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది.  పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఉపయోగించుకోవడానికి ఈ స్మార్ట్‌వాచ్ అనువైనది. 

ఈ వాచ్ iOS, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పనిచేస్తుంది. ఇందులో యాక్సిలరోమీటర్, SpO2 ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్ వంటి సెన్సార్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా. ఈ వాచ్ పూర్తిగా ఛార్జ్ చేస్తే 7 రోజుల బ్యాకప్ ఇస్తుంది. అంతేకాకుండా హార్ట్ రేట్ మానిటరింగ్, స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

నథింగ్ వాచ్ ప్రో

నథింగ్ వాచ్ ప్రో (Nothing Watch Pro) మోడల్‌ను ఇప్పుడు రూ.2499కి కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌లోని 1.9 అంగుళాల AMOLED డిస్‌ప్లే చాలా పెద్దది. 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇది మెరుగైన లొకేషన్ ట్రాకింగ్ కోసం 5-శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. AI నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్ ద్వారా మీరు బ్లూటూత్ ద్వారా హాయిగా కాల్‌ మాట్లాడుకోవచ్చు. 

హార్ట్ రేట్, SpO2, స్లీప్, స్ట్రెస్ ట్రాకింగ్ వంటి హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో పాటు ఇది 110 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. భద్రతా ఫీచర్లు, వాచ్‌ఫోన్ సామర్థ్యాలు అన్నీ ఉన్నాయి. ఈ వాచ్ 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

Latest Videos

click me!