RBI New Rules: జాగ్రత్త సుమా.. పేమెంట్స్ చేసేటప్పుడు మోసం చేస్తే రూ.10 లక్షల జరిమానా!

Published : Feb 05, 2025, 08:49 PM IST

RBI New Rules: పేమెంట్స్ చేసేటప్పుడు RBI నిబంధనలు ఉల్లంఘిస్తే ఇకపై జరిమానాలు చాలా తీవ్రంగా ఉండనున్నాయి. ఎంతలా అంటే రూ.10 లక్షల వరకు ఫైన్ వేస్తారట. RBI కొత్త నిబంధనల గురించి వివరంగా తెలుసుకుందాం రండి. 

PREV
15
RBI New Rules: జాగ్రత్త సుమా.. పేమెంట్స్ చేసేటప్పుడు మోసం చేస్తే రూ.10 లక్షల జరిమానా!

ఆర్ఠిక లావాదేవీల్లో మోసాలను నివారించడానికి, నేరాలు జరగకుండా ఉండటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. చెల్లింపులు, సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 ప్రకారం RBI జరిమానాలు, నిబంధనలను సవరించింది. వీటి వల్ల ఇకపై అనుమతి లేకుండా పేమెంట్స్ చేసినా, ట్రాన్సాక్షన్స్ లో రిజర్వ్ బ్యాంకు నిబంధనలు పాటించకపోయినా జరిమానాలు చాలా ఎక్కువగా విధిస్తారు. 

25

సవరించిన మార్గదర్శకాల ప్రకారం అనుమతి లేకుండా పేమెంట్ సిస్టమ్ ను నిర్వహించినా, అధికారులు అడిగిన అవసరమైన సమాచారాన్ని ఇవ్వకపోయినా గట్టిగానే ఫైన్ వేస్తారు. ఇవే కాకుండా RBI మార్గదర్శకాలను పాటించకపోవడం, KYC, AML నిబంధనలను ఉల్లంఘించడం వంటివి చేసినా ఆర్థిక నేరంగా పరిగణించి జరిమానాలు విధిస్తారు.

35

పైన తెలిపిన ఆర్థిక తప్పులకు పాల్పడితే రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. లేదా ఎంతైతే మోసం చేస్తారో దానికి రెండింతలు ఫైన్ వేస్తారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది జరిమానాగా వసూలు చేయడానికి RBIకి అధికారం ఉంది.

ఈ ఫైన్ కట్టకపోతే తీవ్ర ఆర్థిక నేరంగా పరిగణించి మొదటి రోజు తర్వాత ప్రతి రోజు రూ.25,000/- వరకు జరిమానా విధిస్తారు. 

45

RBI జరిమానా విధించే విధానాలను కూడా వివరించింది. వాటి ప్రకారం RBI నుండి ఉల్లంఘనకు సంబంధించి వివరణ కోరుతూ ముందుగా నోటీసులు పంపిస్తారు. ఒక్కోసారి వ్యక్తిగత విచారణకు కూడా పిలువచ్చు. 

కాంపౌండింగ్ కోరుకునే సంస్థలు అవసరమైన డాక్యుమెంట్స్ తో దరఖాస్తు చేయాలి. కాంపౌండింగ్ జరిమానా కంటే 25 % తక్కువగా ఉండవచ్చు. అది నోటీసు జారీ చేసిన 30 రోజులలోపు చెల్లించాలి. నిర్ణీత సమయంలోపు జరిమానా లేదా కాంపౌండింగ్ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే నేరపూరిత చర్యగా భావించి చర్యలు తీసుకుంటారు. 

55

సంస్థలు కూడా తమ వార్షిక ఆర్థిక నివేదికలలో జరిమానాలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఆ వివరాలను RBI వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలిపింది. ఈ సవరించిన నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయని RBI ప్రకటించింది. 

డిజిటల్ వాలెట్, ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలు, UPI వంటి డిజిటల్ పేమెంట్స్ మెథడ్స్ పెరుగుతున్న నేపథ్యంలో లావాదేవీలను మరింత సురక్షితంగా చేయడం కోసమే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు RBI తెలిపింది. 

click me!

Recommended Stories