అసలు ఏంటీ UPI లైట్, UPI లైట్ వాలెట్
ఏదన్నా కొన్నా, ఎవరికైనా డబ్బులు పంపిచాలన్నా యూపీఐ పిన్ నమోదు చేయకుండానే చెల్లింపులు చేయడానికి UPI లైట్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇటువంటి UPI ఒక్కో లావాదేవీకి రూ.500 వరకు మాత్రమే లిమిట్. ఇకపై ఒక వ్యక్తి UPI పిన్ లేకుండానే రూ.1000 వరకు సింపుల్ గా సెండ్ చేయొచ్చు. UPI లైట్ ద్వారా చేసే లావాదేవీలు వ్యక్తి బ్యాంక్ పాస్‌బుక్‌లో రాయరు. అయితే ఒక వ్యక్తి UPI లైట్ లావాదేవీలను తనిఖీ చేయడానికి వారి UPI యాప్ ట్రాన్సాక్షన్ హిస్టరీని తనిఖీ చేయవచ్చు.
UPI లైట్ సదుపాయాన్ని ఉపయోగించడానికి ఒక వ్యక్తి యూపీఐ లైట్ వాలెట్‌లో డబ్బులు వేయాల్సి ఉంటుంది. ఈ యూపీఐ లైట్ వాలెట్ BHIM, Google Pay, PhonePe మొదలైన యాప్‌లలో అందుబాటులో ఉంది. UPI PINని నమోదు చేయకుండానే లావాదేవీలు చేయడానికి ఒక వ్యక్తి UPI లైట్ వాలెట్‌లో రూ. 2,000 వరకు ఉంచకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి చెల్లింపులు చేయడానికి UPI లైట్ వాలెట్‌లో రూ. 5,000 వరకు మెయిన్‌టెయిన్ చేయవచ్చు.