ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసినా రూ.50,000 పెన్షన్ పొందొచ్చు

First Published | Nov 23, 2024, 2:43 PM IST

జాబ్ చేయడం ప్రారంభించినప్పుడే పెన్షన్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ పాటికి చాలా డబ్బు దాచేవాడిని. రిటైర్మెంట్ తర్వాత ఇబ్బంది ఉండేది కాదు అని చాలా మంది బాధపడుతుంటారు కదా.. అయితే ఇప్పటి నుంచి ఏదైనా పెన్షన్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే మీరు నెలకు రూ.50 వేలు పెన్షన్ పొందవచ్చు. అదెలాగో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 

ఉద్యోగం రాగానే పెళ్లి చేసేస్తారు. వెంటనే పిల్లలు, వారి చదువులు, ఇంట్లో పెద్ద వాళ్ల ఆరోగ్యం కాపాడటం ఇలా  బాధ్యతలు పెరిగిపోతాయి. ఇక వచ్చిన జీతం వచ్చినట్టుగానే ఖర్చయిపోతుంటుంది కదా.. ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలా మంది అనుకుంటారు... డబ్బులు ఏమీ సేవ్ చేయడం లేదు, రిటైర్మెంట్ తర్వాత ఎలా బతకాలి అని.. 

అలా బాధ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఏదైనా పెన్షన్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే చాలు ప్రతి నెలా రూ.50,000 సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) మీ నిరాశను దూరం చేస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ రిటైర్మెంట్ తర్వాత భారీ మొత్తంలో డబ్బు అందుకుంటారు. దాని ద్వారా మీ రిటైర్మెంట్ తర్వాత జీవితం ప్రశాంతంగా సాగుతుంది. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవిస్తే సరిపోతుంది. దాని కోసం ఇప్పటి నుంచే NPSలో ఇన్వెస్ట్ చేయడం మంచిది.

మీరు ఒక 25 ఏళ్లకు ఉద్యోగం చేయడం ప్రారంభించారు అనుకుందాం. ప్రస్తుతం మీకు ఓ 40 ఏళ్లు ఉంటే.. 15 సంవత్సరాలుగా ఏం దాచలేకపోయానని బాధపడకండి. ఈ వయసులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించినా నెలకు రూ.50,000 పెన్షన్ పొందవచ్చు.


NPS ఒక ప్రభుత్వ పథకం. ఇది మార్కెట్‌తో లింక్ అయి ఉంటుంది. ఈ పథకం పెన్షన్‌తో పాటు, ఒక పెద్ద మొత్తాన్ని కూడా ఇస్తుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం చాలా మంది పెన్షన్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కువ పెన్షన్ కావాలంటే NPS మంచి ఆప్షన్. 40 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేస్తే రూ.50,000 పెన్షన్ పొందవచ్చు.

18 నుండి 70 ఏళ్ల వయసున్న ఏ భారతీయుడైనా నేషనల్ పెన్షన్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పెట్టుబడి పెట్టిన దానిలో 60% రిటైర్మెంట్ సమయంలో తీసుకోవచ్చు. మిగిలిన 40% నగదును మీరు పెన్షన్ ప్లాన్(అన్యుటీ) లో పెట్టుబడి పెట్టాలి. దీని నుండి మీకు పెన్షన్ వస్తుంది.

జాతీయ పెన్షన్ సిస్టమ్ ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) పెన్షన్ ప్లాన్స్ నిర్వహిస్తుంది. మీరు సొంత అవసరాలకు తీసుకొనే 60 శాతం నగదుకు మీరు ఎలాంటి ఆదాయపు పన్ను కట్టాల్సిన పని లేదు. ఇది ఇన్ కమ్ టాక్స్ చట్టంలోని 80C సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు టాక్స్ ఫ్రీ ప్రయోజనం పొందొచ్చు. ఇది కాకుండా సెక్షన్ 80CCD (1B) కింద రూ. 50,000 వరకు వార్షిక పెట్టుబడిపై పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. 

రూ. 50,000 నెలవారీ పెన్షన్ కావాలంటే 40 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ.15,000 ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 65 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు మొత్తం పెట్టుబడి రూ.45 లక్షలు అవుతుంది. రూ.45 లక్షలపై 10% వడ్డీ వస్తే రూ.1,55,68,356 వస్తుంది. మొత్తం అమౌంట్ వచ్చేసి రూ.2,00,68,356 అవుతుంది.

ఇందులో 60% అంటే రూ.1,20,41,013 మీరు ఒకేసారి తీసుకోవచ్చు. దీనికి మీరు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన 40% అంటే రూ.80,27,342 యాన్యుటీగా మీరు పెట్టుబడి పెడతారు. ఇది స్టాక్ మార్కెట్ తో సంబంధం ఉంటుంది. ఇదే మొత్తానికి 8% రాబడి వస్తే నెలకు రూ.53,516 పెన్షన్ వస్తుంది.

Latest Videos

click me!