బ్లాక్ ఇంకుతో చెక్ పై సంతకం పెడితే చెల్లదా? RBI ఏమంటోంది

Published : Jan 19, 2025, 09:52 AM IST

మీరు ఎవరికైనా బ్యాంకు చెక్ ఇచ్చేటప్పుడు బ్లాక్ పెన్ వాడుతున్నారా? బ్లాక్ ఇంక్ పెన్ ఉపయోగించి డీటైల్స్ ఫిల్ చేస్తున్నారా? చెక్కులపై బ్లాక్ ఇంక్ వాడటాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజమెంత? ఈ వైరల్ వార్తపై ఆర్బీఐ ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి.   

PREV
15
బ్లాక్ ఇంకుతో చెక్ పై సంతకం పెడితే చెల్లదా? RBI ఏమంటోంది

సాధారణంగా మనం ఏ అప్లికేషన్ ఫిల్ చేయడానికైనా ఎక్కువగా బ్లూ, బ్లాక్ పెన్స్ వాడుతుంటాం కదా? బ్యాంక్ చెక్స్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఇవే ఉపయోగిస్తుంటాం. ఎక్కువ మంది బ్లూ ఇంక్ పెన్స్ వాడుతుంటారు. కొంతమంది సెంటిమెంట్ గా బ్లాక్ ఇంక్ పెన్ కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ఇకపై బ్యాంక్ చెక్స్ పై నిర్దిష్ట ఇంక్ కలర్స్‌ను ఉపయోగించాలని, ముఖ్యంగా బ్లాక్ ఇంక్ ఉపయోగించకూడదని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెప్పినట్టుగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా కంగారు పడుతున్నారు. ఈ విషయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (PIB ఫాక్ట్ చెక్) స్పందించింది. ఏది నిజమో వివరించింది. 
 

25

బ్యాంకు చెక్కులు రాసేటప్పుడు ప్రత్యేకంగా కొన్ని కలర్ ఇంక్ పెన్నులే వాడాలని RBI నుండి ఎటువంటి ఆదేశాలు లేవని PIB ఫాక్ట్ చెక్ తన X (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. ఈ తప్పుడు సమాచారం నిరాధారమైందని కొట్టి పారేసింది. ఇలాంటి  పుకార్లు నమ్మవద్దని సూచించింది. ఇలాంటి విషయాలపై అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని కోరింది. 
 

35

చెక్కులపై ఏ ఇంక్ పెన్స్ ఉపయోగించవచ్చు? 
సాధారణ బ్యాంకింగ్ పద్ధతులలో నీలం లేదా నలుపు రంగు పెన్స్ ఉపయోగించాలి. ఎందుకంటే ఈ రంగుల్లో లెటర్స్, నంబర్స్ స్పష్టంగా కనిపిస్తాయి. 

చెక్కుపై ఎక్కువగా బ్లూ పెన్స్ ఉపయోగించడం మంచిది. ఎందుకంటే చెక్స్ పై ప్రింట్ అయిన టెక్స్ట్ నుంచి చేతితో రాసిన సమాచారాన్ని వేరు చేయడంలో బ్లూ ఇంక్  సహాయపడతుంది. బ్లాక్ ఇంక్ పెన్స్ కూడా వాడొచ్చు. కాని ప్రింటెడ్ మ్యాటర్, చేతితో రాసిన వివరాలు కలిసిపోయే అవకాశాలుంటాయి. అలా అని బ్లాక్ ఇంక్ వాడకూడదని ఎక్కడా నిబంధన లేదు. 

బ్యాంకులు చేతితో రాసిన వివరాలను సింపుల్ గా గుర్తించడంలో బ్లూ ఇంక్  బాగా ఉపయోగపడుతుంది. 
 

45

ఏ అప్లికేషన్ కైనా రెడ్ కలర్ పెన్స్ ఉపయోగించకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా చెక్స్ విషయంలో ఈ కలర్ వాడకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే రెడ్ కలర్ అధికారిక పనుల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అలా అని రెడ్ కలర్ పెన్స్ వాడకూడదని ఎక్కడా లేదు. వివరాలు రాసేటప్పుడు ఏవైనా కొట్టివేతలు ఉంటే అధికారులు తప్పుగా భావించే అవకాశాలుంటాయి. 
 

55

అదేవిధంగా పెన్సిల్ లేదా ఎరేసబుల్ ఇంక్ కచ్చితంగా వాడకూడదు. వీటిని ఉపయోగిస్తే మీరు రాసిన వివరాలను ఎవరైనా సులభంగా మార్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం పెన్సిల్స్, ఎరేసబుల్ ఇంక్స్ వాడకుండా ఉండటమే మంచిది. 

ఆకుపచ్చ లేదా ఊదా వంటి ఇతర రంగులు ఉపయోగించడం బ్యాంక్ స్కానింగ్ సిస్టమ్‌లకు అనుకూలంగా ఉండవు. మీరు రాసిన అప్లికేషన్ గాని, చెక్ లో గాని సమాచారం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి రంగులను కూడా నివారించడం ఉత్తమం.
 

click me!

Recommended Stories