రైళ్లలో ప్రయాణించడానికి మొత్తం బోగీని బుక్ చేసుకోవడం కంటే సింగిల్ సీట్లు బుక్ చేసుకోవడం చాలా చవక. మొత్తం బోగీ బుకింగ్‌కి అదనపు ఛార్జీలు, పన్నులతో సహా మూడు రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. కానీ ఒకే పీఎన్ఆర్‌లో ఆరుగురికి మించి టిక్కెట్లు బుక్ చేసుకోలేము. కాబట్టి విడివిడిగా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కానీ ఒకే పీఎన్ఆర్‌లో ఆరు టిక్కెట్ల కన్నా ఎక్కువ బుక్ చేయలేం. అందుకే విడివిడిగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. 72 సీట్లకు 12 మంది ఒకేసారి బుక్ చేసుకున్నా, వేర్వేరు బోగీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఒకేసారి టిక్కెట్లు బుక్ అవుతూ ఉంటాయి. బోగీ లేదా రైలు బుకింగ్ పూర్తి ఛార్జీలతో (FTR) జరుగుతుంది.