కేవలం 15 షేర్లతో రూ.15 వేల కోట్లు సంపాదించిన వ్యక్తి ఎవరో తెలుసా?

First Published | Oct 15, 2024, 4:27 PM IST

స్టాక్ మార్కెట్ ఓ మాయాజాలం. తెలివితేటలు ఉపయోగించి ఇన్వెస్ట్ చేస్తూ ఇక్కడ కుబేరులు అయిన వారున్నారు. అదేవిధంగా బికారులుగా మారిపోయిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి కేవలం 15 షేర్లతో రూ.15 వేల కోట్ల సంపదను ఎలా సృష్టించాడో మీరు తెలుసుకోబోతున్నారు. స్ఫూర్తివంతమైన అతని జీవిత ప్రయాణం  గురించి తెలుసుకుంటే మీరు షేర్ మార్కెట్ తెలివిగా పెట్టుబడులు పెట్టి ధనవంతులు కావచ్చు. 
 

మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ధనవంతులైన వారు ఎవరంటే ముందుగా మనకు గుర్తొచ్చేది రాధాకిషన్ దమానీ, విజయ్ కేడియా, ఆశిష్ కచోలియా వంటి పెట్టుబడిదారులు. ఇప్పుడు వీరి పక్కన రామ్ దేవ్ అగర్వాల్ పేరు కూడా చేర్చొచ్చు. వారెన్ బఫెట్‌ను తన గురువుగా భావించే రామ్ దేవ్ అగర్వాల్ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్ననాటి నుంచి ధనవంతుడు కావాలన్న తపనతో చదివి ఇప్పుడు రూ.15 వేల కోట్ల సంపదను సృష్టించాడు. ఇన్ని వేల కోట్ల సంపదను అతను ఎలా తయారు చేయగలిగాడో ఇప్పుడు తెలుసుకుందాం.
 

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రామ్‌దేవ్ అగర్వాల్ జన్మించారు. తన కష్టార్జితంతో నేడు రూ.15,939 కోట్ల నికర సంపదను సంపాదించారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన అగర్వాల్ ICAI నుండి ఛార్టర్డ్ అకౌంటెన్సీ చదివారు. తన లక్ష్యం చేరుకోవడానికి తర్వాత ముంబై వచ్చారు. 1987లో అతను తన స్నేహితుడు మోతీలాల్ ఓస్వాల్‌తో కలిసి మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్(MOFSL)ని ప్రారంభించారు. సబ్ బ్రోకర్ గా కెరీర్ ప్రారంభించిన అగర్వాల్ వద్ద అప్పట్లో రూ.10 లక్షల పోర్ట్ ఫోలియో ఉండేది.
 


రూ.20 కోట్ల నష్టం

హర్షద్ మెహతా కుంభకోణంలో రామ్‌దేవ్ అగర్వాల్ భారీ నష్టాన్ని చవిచూశారు. ఆ సమయానికి ఆయన పోర్ట్‌ఫోలియో రూ.30 కోట్లు ఉండేది. 1992లో హర్షద్ మెహతా కుంభకోణం వల్ల రూ.10 కోట్లకు పడిపోయింది. అంటే 20 కోట్ల నష్టం వచ్చింది. అయినా భయపడకుండా ధైర్యంగా జీవితాన్ని కొనసాగించారు. 1990 టైమ్ లో రూ.20 కోట్లు అంటే ఎంత నష్టమో ఆలోచిస్తేనే భయమేస్తుంది. అది కూడా ఒక మధ్య తరగతి వ్యక్తి ఇంత నష్టాన్ని భరించడమంటే మామూలు విషయం కాదు. 
 

రూ.20 కోట్ల నష్టం

హర్షద్ మెహతా కుంభకోణంలో రామ్‌దేవ్ అగర్వాల్ భారీ నష్టాన్ని చవిచూశారు. ఆ సమయానికి ఆయన పోర్ట్‌ఫోలియో రూ.30 కోట్లు ఉండేది. 1992లో హర్షద్ మెహతా కుంభకోణం వల్ల రూ.10 కోట్లకు పడిపోయింది. అంటే 20 కోట్ల నష్టం వచ్చింది. అయినా భయపడకుండా ధైర్యంగా జీవితాన్ని కొనసాగించారు. 1990 టైమ్ లో రూ.20 కోట్లు అంటే ఎంత నష్టమో ఆలోచిస్తేనే భయమేస్తుంది. అది కూడా ఒక మధ్య తరగతి వ్యక్తి ఇంత నష్టాన్ని భరించడమంటే మామూలు విషయం కాదు. 
 

100 కోట్ల పోర్ట్‌ఫోలియో

2000 సంవత్సరంలో రామ్‌దేవ్ అగర్వాల్ పోర్ట్‌ఫోలియో రూ.100 కోట్లకు పెరిగింది. పరిశోధన, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి వ్యూహం ద్వారా అతను ప్రైవేట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ మొదలైన రంగాలలో MOFSL గ్రూప్‌ను బలోపేతం చేశారు. ఈ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.43,090 కోట్లకు పెరిగింది. 

సహనంలోనే విజయం: రామ్‌దేవ్ అగర్వాల్ 

2024 నాటికి రామ్‌దేవ్ అగర్వాల్ నికర విలువ రూ.15,939 కోట్లు. ఆయన భార్య సునీతా అగర్వాల్, కుమారుడు వైభవ్ అగర్వాల్ కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడంలో ఆయనకు సహకరిస్తున్నారు. కఠోర శ్రమ, సరైన వ్యూహంతో ఈరోజు రామ్ దేవ్ అగర్వాల్ ఈ స్థానానికి చేరుకున్నారు. ప్రతి పెట్టుబడిదారుడు సహనంతో ఉండాలని, షేర్ లను ఎప్పటికప్పుడు మార్చేయడం వల్ల పెద్దగా లాభాలు ఉండవని రామ్ దేవ్ సలహా ఇస్తున్నారు. 
 

Latest Videos

click me!