PURE EV
బడ్జెట్ విభాగంలో ప్యూర్ ఈవీ ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ సరసమైన ధరకే లభించే బైక్ గా నిలిచింది. దాని అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, సుదీర్ఘ శ్రేణి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆనందాన్నిస్తుంది. ఈ బైక్ ధర రూ.99,999. ఇది ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో అత్యంత ధర తక్కువ కలిగిన వాటిల్లో ఒకటి. ముఖ్యంగా దాని ఫీచర్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
మీరు ఖర్చు గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే బైక్ యాజమాన్యమే సులభమైన ఫైనాన్సింగ్ పథకం కల్పిస్తోంది. రూ.11,000 డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. ఈ రుణంపై వడ్డీ రేటు 9.7%గా ఉంది. అంతేకాకుండా మీరు మూడు సంవత్సరాల కాలానికి నెలకు రూ.3,021 EMI చెల్లించాలి.